ప్రముఖ ఎడ్‌ టెక్‌ స్టార్టప్‌ కంపెనీ బైజూస్‌ను(Byjus) ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సంస్థ నష్టాల బాట పట్టింది. స్టార్టప్‌(Startup) కంపెనీల్లో ఎంత వేగంగా దూసుకెళ్లింతో అంతే వేగంగా ఆ సంస్థ కుప్పకూలిపోయింది. ఉద్యోగులకు(Employees) జీతాలు ఇవ్వలేక విలవిలలాడుతోంది. దీంతో జీతాలు చెల్లించేందుకు బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌(Ravindran) ఆస్తులు(Assets) తాకట్టిపెట్టి రుణాలు తీసుకుంటున్నాడని సమాచారం

ప్రముఖ ఎడ్‌ టెక్‌ స్టార్టప్‌ కంపెనీ బైజూస్‌ను(Byjus) ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సంస్థ నష్టాల బాట పట్టింది. స్టార్టప్‌(Startup) కంపెనీల్లో ఎంత వేగంగా దూసుకెళ్లింతో అంతే వేగంగా ఆ సంస్థ కుప్పకూలిపోయింది. ఉద్యోగులకు(Employees) జీతాలు ఇవ్వలేక విలవిలలాడుతోంది. దీంతో జీతాలు చెల్లించేందుకు బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌(Ravindran) ఆస్తులు(Assets) తాకట్టిపెట్టి రుణాలు తీసుకుంటున్నాడని సమాచారం.బెంగళూరులో(Bengaluru) తనకు, కుటుంబసభ్యులకు ఉన్న రెండు ఇళ్లను, నిర్మాణంలో ఉన్న మరో విల్లాను(Villa) తాకట్టు పెట్టినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ ఇళ్లను తాకట్టు పెట్టి 12 మిలియన్‌ డాలర్ల (million dollars) రుణం తీసుకున్నాడని ఈ కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ డబ్బుతో బైజూస్‌ మాతృసంస్థ 'థింక్‌ అండ్‌ లెర్న్‌(think & Learn) ప్రైవేట్‌ లిమిటెడ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్లు సమాచారం. బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ కానీ, కంపెనీ వర్గాలు కానీ ఈ విషయాన్ని ధృవీకరించలేదు

Updated On 5 Dec 2023 4:46 AM GMT
Ehatv

Ehatv

Next Story