సమాజంలో కొందరు చీడపురుగులు ఉంటారు.
సమాజంలో కొందరు చీడపురుగులు ఉంటారు.. కన్నతల్లి అని చూడకుండా రేప్ చేసిన కొడుకును ఏం చేసినా పాపం లేదనడానికి ఈ ఘటనే తాజా ఉదాహరణ. ఉత్తరప్రదేశ్(Uttar pradesh)లోని బులంద్‌షహర్(Bulandshahr)లో తన 60 ఏళ్ల తల్లిపై అత్యాచారం చేసిన కేసులో 38 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు విధించారు. గతేడాది జనవరి 16న ఆ వ్యక్తి తన తల్లిపై అత్యాచారం చేయగా, అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి తీర్పు వెల్లడించింది. "ఈ అత్యాచారం కేసు సుమారు ఏడాదిన్నర క్రితం నమోదైంది. ఒక మహిళ తన కుమారుడిపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషికి శిక్ష విధించింది. అతనికి జీవిత ఖైదు, రూ.51 వేల జరిమానా విధించారు.
ప్రభుత్వ న్యాయవాది విజయ్ కుమార్ శర్మ (Vijay kumar sharma)మాట్లాడుతూ తన కెరీర్‌లో ఇలాంటి కేసు ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు. 'నా కొడుకు నాపై అత్యాచారం చేశాడు' అని తల్లి ఏడుస్తూ పదే పదే చెప్పింది. ఆ వ్యక్తి తన తల్లిని పొలం నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నారు. తన కొడుకు తనను పొలానికి తీసుకెళ్లి, తన గొంతును బిగించి, అత్యాచారం చేసి, లైంగిక చర్యల్లో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చాడని మహిళ తన వాంగ్మూలంలో పేర్కొంది. నేను వేడుకున్నా వినలేదని నాపై అత్యాచారం ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయానని.. సంఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. అయితే నిందితుడు కూడా మరో వాదన వినిపించాడు. తాను నేరం చేయలేదని, నిర్దోషినని దోషి పోలీసులకు తెలిపాడు. తనపై పెట్టిన కేసు తప్పుడుదని, తన ఆస్తిని కాజేసేందుకు నమోదు చేశారని అన్నారు. నిందితుడికి, తల్లికి మధ్య ఆస్తి వివాదాన్ని రుజువు చేయడానికి డిఫెన్స్ ఎటువంటి సాక్షులను హాజరుపరచలేదని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆస్తి కోసం తన కొడుకు తనపై అత్యాచారం చేశాడని ఏ తల్లి కూడా ఆరోపించదని కోర్టు ఉత్తర్వుల్లో తెలిపింది. అత్యాచారంతో పాటు, నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డాడని దోషిగా నిర్ధారించింది. బెదిరింపులకు పాల్పడినందును ఏడాది సంవత్సరం జైలు శిక్ష, వెయ్యిరూపాయలు జరిమానా విధించారు. రెండు జైలు శిక్షలు ఏకకాలంలో అమలు అవుతాయని కోర్టు పేర్కొంది.