కర్నాటకలో(Karnataka) హృదయ విదారకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లా దండెలి(Dandeli) తాలుకాలో తల్లిదండ్రుల మధ్య చెలరేగిన ఘర్షణ బాలుడి ప్రాణాలను బలికొన్నది. పుట్టుకతో మూగవాడిగా(Mute child) పుట్టిన బాబును మొసళ్లు ఉన్న కాలువలో తల్లి సావిత్రి విసిరేసింది. మూగవాడిని ఎందుకు కన్నావ్‌ అన్న భర్త మాటలను తట్టుకోలేక తల్లి ఈ పనిచేసింది.

కర్నాటకలో(Karnataka) హృదయ విదారకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లా దండెలి(Dandeli) తాలుకాలో తల్లిదండ్రుల మధ్య చెలరేగిన ఘర్షణ బాలుడి ప్రాణాలను బలికొన్నది. పుట్టుకతో మూగవాడిగా(Mute child) పుట్టిన బాబును మొసళ్లు ఉన్న కాలువలో తల్లి సావిత్రి విసిరేసింది. మూగవాడిని ఎందుకు కన్నావ్‌ అన్న భర్త మాటలను తట్టుకోలేక తల్లి ఈ పనిచేసింది. మూగవాడిని ఎందుకు కన్నావ్‌.. విసిరి అవతల పాడేయ్‌ అని తరుచూ భార్యతో భర్త గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో గత శనివారం కూడా భార్యాభర్తల మధ్య ఇదే విషయంమై మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన భార్య తన కొడుకును తీసుకెళ్లి మొసళ్లు(crocodile) ఉన్న కాలువలోకి విసిరేసింది. కానీ తల్లి మనసు కదా.. తిరిగి వచ్చి తన కొడుకును రక్షించాలని కేకలు వేసింది. దీంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగువారు బాలుడి కోసం వెతకసాగారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాలుడి కోసం గాలించారు. ఎంతగాలించిన బాలుడి ఆచూకీ దొరకకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం కాలువలో వెతకగా బాలుడి మృతదేహం బయటపడింది. పోలీసులు సావిత్రిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తన కొడుకు మూగ వాడు కోవడంతో తన భర్త వేధించేవాడని.. 'బాబు తినడానికి తప్ప దేనికీ పనికిరాడని అనేవాడని.. వాడిని అవతల పడేయ్‌.. వాడి చావు వాడు చస్తాడు' అనేవాడని పోలీసులకు తల్లి సావిత్రి చెప్పింది. భార్యాభర్తపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Updated On 6 May 2024 1:08 AM GMT
Ehatv

Ehatv

Next Story