షహబాద్ డెయిరీ(Sahabad Dairy) ప్రాంతంలో సంచలనం సృష్టించిన హత్య కేసుతో రాజధాని ఢిల్లీ(delhi) మరోసారి ఉలిక్కిపడింది. షహబాద్ డెయిరీ ప్రాంతం బి బ్లాక్‌లో ఓ మైనర్ బాలికను ప్రేమోన్మాది కత్తితో 21 సార్లు పొడిచి చంపాడు. మృతురాలిని జేజే కాలనీకి చెందిన మైన‌ర్ బాలిక‌గా గుర్తించారు.

షహబాద్ డెయిరీ(Sahabad Dairy) ప్రాంతంలో సంచలనం సృష్టించిన హత్య కేసుతో రాజధాని ఢిల్లీ(delhi) మరోసారి ఉలిక్కిపడింది. షహబాద్ డెయిరీ ప్రాంతం బి బ్లాక్‌లో ఓ మైనర్ బాలికను ప్రేమోన్మాది కత్తితో 21 సార్లు పొడిచి చంపాడు. మృతురాలిని జేజే కాలనీకి చెందిన మైన‌ర్ బాలిక‌గా గుర్తించారు. ఆమె మృతదేహం వీధిలో కనిపించింది. నిందితుడిని మహ్మద్ సాహిల్‌గా గుర్తించారు. నిందితుడు షహాబాద్ డెయిరీ ప్రాంతంలో ఉంటూ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. బులంద్‌షహర్‌కు చెందిన నిందితుడు సాహిల్‌ను షహబాద్ డైరీ పోలీసులు అరెస్టు చేశారు.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షహబాద్ డైరీ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల బాలికను.. ఆమె ప్రియుడు 20 ఏళ్ల సాహిల్‌ కత్తితో పొడిచి చంపాడు. సాహిల్, మృతురాలు ఆదివారం గొడవ పడ్డారు. మైన‌ర్ బాలిక‌ తన స్నేహితుడి కుమారుడి పుట్టినరోజు వేడుకకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండగా.. నిందితుడు ఆమెను అడ్డుకుని, కత్తితో పలుమార్లు పొడిచి, ఆపై రాళ్లతో కొట్టాడు.

షహాబాద్ హత్యకేసుపై ఔటర్ నార్త్ ఏడీసీపీ రాజా బంతియా మాట్లాడుతూ.. ‘అబ్బాయికి, అమ్మాయి ఇంతకు ముందు తెలుసు.. విచారణ జరుపుతున్నామని.. సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. 20కి పైగా కత్తిపోట్లు ఉన్న‌ట్లు గుర్తించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ స్పందించారు. ఇలాంటి భయానకమైన కేసును నేనెప్పుడూ చూడలేదు. ఈరోజు జరిగిన హ‌త్య‌ పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యాన్ని తెలియజేస్తుందన్నారు.

Updated On 29 May 2023 5:07 AM GMT
Ehatv

Ehatv

Next Story