మయన్మార్(Myanmar) నుంచి సుమారు 900 మంది ఉగ్రవాదులు
మయన్మార్(Myanmar) నుంచి సుమారు 900 మంది ఉగ్రవాదులు(Terrorists) మణిపూర్‌లోకి(Manipur) చొరబడ్డారని మణిపూర్ ప్రభుత్వ భద్రతా(Nation security) సలహాదారు కుల్దీప్ సింగ్(Kuldeep Singh) ధృవీకరించారు. ఈ ఉగ్రవాదులు అతిపెద్ద(Terrorist attck) దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. దీంతో భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేశారు. మయన్మార్ సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామని కుల్దీప్ సింగ్ పేర్కొన్నారు. భద్రతా బలగాల మోహరింపును పెంచి, గస్తీని ముమ్మరం చేశామన్నారు. ఈ ఉగ్రవాదులు డ్రోన్, క్షిపణి దాడులలో నైపుణ్యం కలిగి ఉన్నారని, ఇది ముప్పు స్థాయిని మరింత పెంచుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. భద్రతా ఏజన్సీల లక్ష్యం పరిస్థితిని నియంత్రించడం, ఏదైనా దాడులకు పూనుకుంటే అడ్డుకోవడమన్నారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాల కానీ, ఎవరైనా అనుమానాస్పదంగా మెదిలితే వెంటనే స్థానిక అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.