ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి కథ ఇది! ఆ చిన్నారి పేరు రణవీర్ భారతి. నవ్వుతూ తుళ్లుతూ ఉండే ఆ చిన్నారికి భయంకరమైన బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) వారణాసి(Varanasi)కి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి కథ ఇది! ఆ చిన్నారి పేరు రణవీర్ భారతి(Ranveer Bharti). నవ్వుతూ తుళ్లుతూ ఉండే ఆ చిన్నారికి భయంకరమైన బ్రెయిన్ ట్యూమర్(Brain Tumour) వచ్చింది. మహా కేన్సర్ ఆసుపత్రి(Maha Cancer Hospital)లో చికిత్స పొందుతున్న ఆ పాపకు ఐపీఎస్(IPS) అవ్వాలన్నది కోరిక. ఆ చిన్నారి అభిలాష గురించి పోలీసు అధికారులకు తెలిసింది. వెంటనే ఆ పాప దగ్గరకు వెళ్లారు. ఆమెకు ఖాకీ దుస్తులు తొడిగించారు. ఏడీజీ క్యాబిన్(ADG Cabin)లోకి తీసుకెళ్లి కూర్చొబెట్టారు. రణవీర్ భారతి ఆ కొద్ది గంటలపాటు అధికారిణి అయ్యింది. పోలీసులకు షేక్‌హ్యాండ్ ఇచ్చింది. పోలీసు సిబ్బందితో సరదాగా గడిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతోంది. ADG జోన్ వారణాసి అధికారిక X (ట్విట్టర్) హ్యాండిల్‌లో చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేరిన విషయాన్ని షేర్ చేస్తూ వీడియోను జత చేశారు. నెటిజన్లు పోలీసు అధికారులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.చిన్నారి కల నెరవేర్చిన అధికారులు