మణిపూర్(Manipur) మళ్లీ భగ్గుమంది. ఈసారి జరిగిన హింసాత్మక సంఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖామెన్‌లోక్ ప్రాంతంలో నిన్న రాత్రి జరిగిన ఫైరింగ్‌లో(Firing) చాలా మంది గాయపడ్డారు. వీరిని ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారి శరీరాలపై అవయవాలు తెగిన గుర్తులు, బుల్లెట్ గాయాలు ఉన్నాయట. మరోసారి హింసాకాండ చెలరేగడంతో సడలించిన కర్ఫ్యూ నిబంధనలను కఠినతరం చేశారు.
మణిపూర్(Manipur) మళ్లీ భగ్గుమంది. ఈసారి జరిగిన హింసాత్మక సంఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖామెన్‌లోక్ ప్రాంతంలో నిన్న రాత్రి జరిగిన ఫైరింగ్‌లో(Firing) చాలా మంది గాయపడ్డారు. వీరిని ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారి శరీరాలపై అవయవాలు తెగిన గుర్తులు, బుల్లెట్ గాయాలు ఉన్నాయట. మరోసారి హింసాకాండ చెలరేగడంతో సడలించిన కర్ఫ్యూ నిబంధనలను కఠినతరం చేశారు. కంగ్‌పోక్పీ, ఇంఫాల్‌కు తూర్పున ఉన్న జిల్లాల సరిహద్దులో ఖామెన్‌లోక్ ప్రాంతం ఉంది.
చాలా రోజులుగా ఈ ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలో మణిపూర్ నలిగిపోతున్నది. గిరిజన హోదా కోసం మెయితీలు డిమాండ్ చేస్తుంటే కుకీ వర్గం మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మెయితీలకు ఎస్టీ హోదా ఇవ్వకూడదని పట్టుబడుతోంది. ఈ రెండు తెగల మధ్య భేదాభిప్రాయాలు గొడవల వరకు వచ్చాయి. అవి కాస్తా హింసకు దారి తీశాయి. మొత్తంగా ఇప్పటి వరకు వంద మందికిపైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు.