ఓ భవనం నుంచి లిఫ్ట్(Lift) కూలిపోవడంతో.. అందులో ప్రయాణిస్తున్న 9 మందికి గాయాలయ్యాయి. గ్రేటర్‌ నోయిడాలో(Noida) ఈ సంఘటన చోటుచేసుకుంది. నోయిడా సెక్టార్ 125 రివర్‌ సైడ్ టవర్‌లోని 8వ అంతస్తు నుంచి లిఫ్ట్‌ కూలిపోవడంతో 9 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురికి తీవ్రగాయాలైనట్లు, మరో నలుగురికి సాధారణ గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

నోయిడాలోని ఓ హైరైజ్(Highrise) బిల్డింగ్‌లో ఎరాస్మిత్‌ టెక్నాలజీస్‌లో పనిచేసే ఉద్యోగులు విధులు ముగించుకొని తిరిగి వెళ్తుండగా 8వ అంతస్తు నుంచి ఒక్కసారిగా లిఫ్ట్‌ కుప్పకూలింది. ఇందులో ఐదుగురు ఉద్యోగులకు చేతులు, కాళ్లు విరిగిపోయాని.. మిగిలినవారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించామని.. ఎవరికీ ప్రాణాపాయంలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన ఇద్దరు లిఫ్ట్‌ మెయింటెనెన్స్ చేసేవారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అయితే ఈ ఏడాది నోయిడాలో ఇలాంటి ప్రమాదాలు కొన్ని చోటుచేసుకోగా.. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.

Updated On 23 Dec 2023 3:20 AM GMT
Ehatv

Ehatv

Next Story