మధ్యప్రదేశ్లోని(Madhya Pradesh) బుందేల్‌ఖండ్‌లో(Bundelkhand) విచిత్రమైన సంఘటన జరిగింది. తండ్రికి తలకొరివి పెట్టడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. అయితే ఆ సంప్రదాయాన్ని కాదని తొమ్మిది మంది కూతుళ్లు తండ్రి చితికి నిప్పంటించారు. బుందేల్‌ఖండ్ పరిధిలోని సాగర్‌లో రిటైర్డ్ పోలీసు అధికారి హరిశ్చంద్ర అహిర్వార్(Harishchandra Ahirwar) ఉంటున్నారు.
మధ్యప్రదేశ్లోని(Madhya Pradesh) బుందేల్‌ఖండ్‌లో(Bundelkhand) విచిత్రమైన సంఘటన జరిగింది. తండ్రికి తలకొరివి పెట్టడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. అయితే ఆ సంప్రదాయాన్ని కాదని తొమ్మిది మంది కూతుళ్లు తండ్రి చితికి నిప్పంటించారు. బుందేల్‌ఖండ్ పరిధిలోని సాగర్‌లో రిటైర్డ్ పోలీసు అధికారి హరిశ్చంద్ర అహిర్వార్(Harishchandra Ahirwar) ఉంటున్నారు. ఆయనకు తొమ్మిది మంది కూతుళ్లు. కొడుకులు లేరు. తొమ్మిది మంది కూమార్తెలలో ఏడుగురికి పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కూతుళ్లకు పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే సడన్‌గా హరిశ్చంద్ర అహిర్వార్ బ్రెయిన్ హెమరేజ్‌కు(Brain hemorrhage) గురయ్యారు. హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ మరణించారు. తండ్రి పోయిన దు:ఖాన్ని అదిమిపెట్టుకుంటూ కూతుళ్లు తామే అంత్యక్రియలు చేసి తండ్రి రుణాన్ని తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వారందరూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ముక్తిధామ్‌లో తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు. కూతుళ్లు చేసిన పనిని మెచ్చుకున్నారు.