బెంగళూరు నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీ అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.
బెంగళూరు నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీ అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అందుకు కారణం హేమ(Actress Hema) ఆ పార్టీలో ఉండటమే! తాను పార్టీలో ఉన్నమాట నిజమే కానీ ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని హేమ చెప్పుకొచ్చారు. పోలీసులు మాత్రం ఆమె మాట నమ్మడం లేదు. ఈ రేవ్ పార్టీ(Ravu Party)పై విచారణ జరుపుతున్న బెంగళూరు(Bengaluru) పోలీసులు లేటెస్ట్‌గా ఛార్జ్‌షీట్(Chargesheet) దాఖలు చేశారు. ఇందులో 88 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో హేమ పేరు కూడా ఉండటం గమనార్హం. పైగా హేమ డ్రగ్స్ సేవించినట్టుగా ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. 1086 పేజీలతో పోలీసులు ఛార్జ్‌షీట్ సిద్ధం చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ ఎండీఎంఏ (MDMA)డ్రగ్స్ సేవించినట్లు ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా ఛార్జ్‌షీట్‌తో జతపరిచారు. హేమతో పాటు 79 మందిని నిందితులుగా చేర్చారు. పార్టీ నిర్వహించిన మరో తొమ్మిది మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. NDPS సెక్షన్- 27 కింద హేమను నిందితురాలిగా ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అయితే, హేమతో పాటు రేవ్ పార్టీకి హాజరైన మరో నటుడికి డ్రగ్స్ తీసుకోలేదని రిపోర్ట్ వచ్చింది. తాజాగా పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ గురించి హేమ ఏమంటారో !