వర్క్ అవర్స్ కంటే ఎక్కువ కష్టపడుతున్నారు..!
గ్లోబల్ జాబ్ మ్యాచింగ్, హైరింగ్ ప్లాట్‌ఫారమ్ నిర్వహించిన ఇటీవలి సర్వేలో(Survey) 88% మంది భారతీయ ఉద్యోగులు(Indian employees) పని గంటలు(Working hours) ముగిసిన తర్వాత కూడా యాజమాన్యం చెప్పే పనులను చేస్తున్నారని తేలింది. 85% మంది సిక్ లివ్ లేదా ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా ఇటువంటి కమ్యూనికేషన్ తమ కంపెనీ కోసం ఏదో ఒక సమయంలో పనిచేస్తున్నారని తేలింది. ఆఫీస్ అవర్స్ ముగిసిన తర్వాత ''డిస్‌కనెక్ట్ హక్కు" విధానాన్ని అమలు చేయాలని 10 మంది ఉద్యోగుల్లో 8 మంది కోరుతున్నారు. జూలై -సెప్టెంబర్ మధ్య 500 మంది యజమానులు, 500 మంది ఉద్యోగార్ధులు, ఉద్యోగుల మధ్య సెన్సస్‌వైడ్ ఈ సర్వేను నిర్వహించింది. మెజారిటీ ఉద్యోగులు (79%) పనిగంటల తర్వాత ప్రతిస్పందించకపోవడం వల్ల ప్రమోషన్‌లు కోల్పోవడం, వృత్తిపరమైన ప్రతిష్ట దెబ్బతినడం లేదా ప్రాజెక్ట్‌లో ఎదురుదెబ్బలు వంటి పరిణామాలకు దారితీయవచ్చని చెప్పారు. అయితే, తక్షణ ప్రాజెక్ట్ అవసరాలు, గడువులు, వాటాదారుల ఒత్తిడి వంటి కారణాల వల్ల, చాలా మంది యజమానులు వర్కింగ్ అవర్స్ తర్వాత కూడా ఉద్యోగులను సంప్రదించవలసి వస్తుంది. దీని ఫలితంగా 66% మంది యజమానులు గంటల తరబడి పనిమీద ఒత్తిడి చేస్తే ఉత్పాదకత దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. ఇంకా, 69% మంది ఉద్యోగార్ధులు తమకు డిస్‌కనెక్ట్ చేసే హక్కు ఉందని.. తమ మేనేజర్‌లు అటువంటి పాలసీని గౌరవిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం పర్చారు. 81% మంది యజమానులు పని గంటల తర్వాత కూడా అందుబాటులో ఉండే ఉద్యోగులకు అదనపు పరిహారం అందించడానికి సుముఖత వ్యక్తం చేశారు, ఉద్యోగుల సమయం విలువను గుర్తించడానికి సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.