క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో(Campus Recruitment) బాంబే ఐఐటీ(Bombay IIT) దుమ్ములేపింది. ఏకంగా ఏడాదికి కోటి రూపాయలకుపైగా వేతనంతో(I crore Package) 85 మంది సెలక్టయ్యారు. 2023-24 క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో భాగంగా సీజన్-1(Season-1) నిర్వహించారు.

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో(Campus Recruitment) బాంబే ఐఐటీ(Bombay IIT) దుమ్ములేపింది. ఏకంగా ఏడాదికి కోటి రూపాయలకుపైగా వేతనంతో(I crore Package) 85 మంది సెలక్టయ్యారు. 2023-24 క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో భాగంగా సీజన్-1(Season-1) నిర్వహించారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 1,340 మందికి ఇంటర్వ్యూలకు హాజరుకాగా 1,188 మందికి ఉద్యోగాలు లభించాయి. ఇందులో 63 మందికి ఇంటర్నేషనల్‌ ఆఫర్లు(International Offers) కూడా రావడం గమనార్హం. ఓ విద్యార్థికి అయితే అత్యధికంగా రూ.3 కోట్ల ఆఫర్‌ తగిలింది. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి.

ఈ సీజన్‌లో క్యాంపస్‌ నుంచి రిక్రూట్‌మెంట్ చేసుకున్న టాప్ కంపెనీలు ఎయిర్‌బస్(Airbus), ఎయిర్ ఇండియా(air India), యాపిల్(Apple), కోహెసిటీ, డా విన్సీ, గూగుల్(Google), ఇంటెల్(Intel), జాగ్వార్ ల్యాండ్ రోవర్, మోర్గాన్ స్టాన్లీ, మెర్సిడెస్-బెంజ్, క్వాల్‌కామ్, రిలయెన్స్ గ్రూప్, శామ్‌సంగ్, స్క్లంబెర్గర్, స్ట్రాండ్ ఉన్నాయి. లైఫ్ సైన్సెస్, టాటా గ్రూప్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, TSMC, TVS గ్రూప్‌, వెల్స్ ఫార్గో. ఇంజినీరింగ్ మరియు టెక్నాలజీ, ఐటీ/సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫిన్‌టెక్, మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ డిజైన్‌లు అత్యధిక సంఖ్యలో ఆఫర్‌లను అందించాయి. 2023-24లో సగటు వార్షిక వేతనం రూ. 36.9 లక్షలుగా ఉంది, ఇది గత సంవత్సరం రూ. 32.25 లక్షలతో పోలిస్తే 12.6 శాతం అధికం.

Updated On 5 Jan 2024 5:49 AM GMT
Ehatv

Ehatv

Next Story