మహారాష్ట్రలోని(Maharastra) ముంబాయి విమానాశ్రయంలో(Mumbai Airport) విషాదం చోటు చేసుకుంది. వీల్‌ఛైర్‌(Wheel chair) అందుబాటులో లేకపోవడంతో 80 ఏళ్ల వృద్దుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అమెరికాలో(America) భారత సంతతికి చెందిన ఓ వృద్ధుడు న్యూయార్క్‌(Newyork) నుంచి ముంబాయి ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు(Chhatrapati Shivaji Maharaj Airport) వచ్చాడు. తన భార్యతో కలిసి ఎయిరిండియా(Air India) విమానంలో ముంబాయికి చేరుకున్నాడు. టికెట్‌ కొంటున్నప్పుడే వీరిద్దరూ వీల్‌ ఛైర్‌ ప్రయాణికులుగానే బుక్‌ చేసుకున్నారు. వయోభారం కారణంగా ల్యాండింగ్‌ అయిన తర్వాత తమ ఇద్దరికి వీల్‌ఛైర్‌ ఇవ్వాలని ఎయిరిండియా సిబ్బందిని కోరారు.

మహారాష్ట్రలోని(Maharastra) ముంబాయి విమానాశ్రయంలో(Mumbai Airport) విషాదం చోటు చేసుకుంది. వీల్‌ఛైర్‌(Wheel chair) అందుబాటులో లేకపోవడంతో 80 ఏళ్ల వృద్దుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అమెరికాలో(America) భారత సంతతికి చెందిన ఓ వృద్ధుడు న్యూయార్క్‌(Newyork) నుంచి ముంబాయి ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు(Chhatrapati Shivaji Maharaj Airport) వచ్చాడు. తన భార్యతో కలిసి ఎయిరిండియా(Air India) విమానంలో ముంబాయికి చేరుకున్నాడు. టికెట్‌ కొంటున్నప్పుడే వీరిద్దరూ వీల్‌ ఛైర్‌ ప్రయాణికులుగానే బుక్‌ చేసుకున్నారు. వయోభారం కారణంగా ల్యాండింగ్‌ అయిన తర్వాత తమ ఇద్దరికి వీల్‌ఛైర్‌ ఇవ్వాలని ఎయిరిండియా సిబ్బందిని కోరారు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో సరిపడా వీల్‌ఛైర్‌లు అందుబాటులో లేకపోవడంతో వీరికి ఒకటే ఇచ్చారు. అందులో తన భార్యను కూర్చొబెట్టిన అతడు ఆమె వెంట నడుచుకుంటూ వెళ్లాడు. విమానం దిగిన చోటు నుంచి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు నడిచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌ దగ్గరకు వచ్చాడు. అక్కడే కుప్పకూలిపోయాడు. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంటనే అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు కానీ అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్టు ధ్రువీకరించారు. ఎయిరిండియా సిబ్బంది వైఖరిపై విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రయాణికులు తిట్టిపోస్తున్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎయిరిండియా వివరణ ఇచ్చుకుంది 'ఇది దురదృష్టకరమైన సంఘటన. ఆ రోజున వీల్‌ఛైర్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. వీల్‌ఛైర్‌ను అరెంజ్‌ చేసేవరకు వేచి చూడమని ఆ ప్రయాణికుడిని రిక్వెస్ట్‌ చేశాము. కానీ ఆయన తన భార్య వెంటే నడుచుకుంటూ వెళతానని చెప్పాడు' అని ఎయిరిండియా అంటోంది. మృతుడి కుటుంబంతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది.
న్యూయార్క్‌ నుంచి ముంబాయి చేరుకున్న ఆ విమానంలో 32 మంది వీల్‌ఛైర్‌ కోసం బుక్‌ చేసుకున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. గ్రౌండ్‌ సిబ్బంది వద్ద కేవలం 15 మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నాయి.

Updated On 16 Feb 2024 7:12 AM GMT
Ehatv

Ehatv

Next Story