ప్రపంచ మానవాళికి రానున్న రోజులన్నీ గడ్డుకాలమే! మనమీద దాడి చేయడానికి ఎనిమిది వైరస్‌లు(Virus) సిద్ధమవుతున్నాయి. వీటి వల్ల మనుషులు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2019లో కరోనా వైరస్‌(Corona Virus) ప్రపంచాన్ని ఎంతగా అల్లాడించిందో మనం చూశాం! కోవిడ్‌(Covid) దెబ్బకు అగ్రరాజ్యాలు కూడా విలవిలలాడిపోయాయి.

ప్రపంచ మానవాళికి రానున్న రోజులన్నీ గడ్డుకాలమే! మనమీద దాడి చేయడానికి ఎనిమిది వైరస్‌లు(Virus) సిద్ధమవుతున్నాయి. వీటి వల్ల మనుషులు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2019లో కరోనా వైరస్‌(Corona Virus) ప్రపంచాన్ని ఎంతగా అల్లాడించిందో మనం చూశాం! కోవిడ్‌(Covid) దెబ్బకు అగ్రరాజ్యాలు కూడా విలవిలలాడిపోయాయి. లక్షలాది మంది కోవిడ్‌ బారినపడి చనిపోయారు. చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో ఇప్పటికీ సతమతమవుతున్నారు. కరోనా కారణంగా వివిధ దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.

ఆ కరోనా వైరస్‌ ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది. ఆల్ఫా, బీటా, ఓమిక్రాన్‌ .. ఇలా రకరకాల రూపాలను సంతరించుకుంటూ మనపై దాడికి దిగుతూనే ఉంది. ఈ కరోనా వైరస్‌ మొట్టమొదట బయటపడింది చైనాలో(China) ఊహాన్‌(Wuhan) నగరంలో అన్న సంగతి మనకు తెలిసిందే! అక్కడ్నుంచి ప్రపంచమంతటా వ్యాపించింది. అది సృష్టించిన బీభత్స భయానకాలు ఇంకా మన స్మృతిపథంలోనే ఉన్నాయి. ఇదిలాఉంటే చైనా దక్షిణ తీరంలోని ఉష్ణమండల ద్వీపమైన హైనాన్‌లో గతంలో ఎన్నడూ చూడని ఎనిమిది రకాల వైరస్‌లను చైనా సైంటిస్టులు కనుగొన్నారు.

ఎలుకలో ఈ వైరస్‌లను గుర్తించారు. ఎప్పుడైనా ఈ వైరస్‌లు ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. ఇది ప్రజలకు ఆందోళన కలిగిస్తున్న అంశం. భవిష్యత్తులో ఎప్పుడైనా వైరస్‌లు విజృంభిస్తే వాటిని ఎదుర్కొనేందుకు ప్రజలను సిద్ధం చేసే పనిలో సైంటిస్టులు(Scientist) ఉన్నారు. తమ పరిశోధనలలో భాగంగా ఏడు వందల ఎలుకల నమూనాలను సేకరించారు. ఇందులో ఒకటి సార్స్‌-కోవ్‌-2(Sars-Cove-2), కోవిడ్‌-19(Covid-19)కి కారణమైన వైరస్ కుటుంబానికి చెందినదని గుర్తించారు.

గబ్బిలాలపై(Bats) పలు పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్‌గా పేరు తెచ్చుకున్న శాస్త్రవేత్త డాక్టర్ షి జెంగ్లీ(Dr. Shi Zhengli) నూతన వైరస్‌లకు సంబంధించిన వివరాలను వైరోలాజికా సినికా జర్నర్‌లో(Journal of Virologica Sinica) ప్రచురించారు. కాగా ఈ వైరస్ లు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుందని డాక్టర్ షి జెంగ్లీ చెబుతున్నారు. వైరోలాజికా సినికా అనేది చైనీస్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీకి చెందిన ప్రచురణ విభాగం. 2011-2021 మధ్య కాలంలో హైనాన్ లో ఎలుకల గొంతు నుంచి 682 నమూనాలను సైంటిస్టులు సేకరించారు. ఈ నేపథ్యంలో జరిగిన పరిశోధనల్లో వాటిలోని వైరస్‌లు వెలుగు చూశాయి. వీటిలో కొన్ని మనిషి ఆరోగ్యానికి ముప్పు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సైంటిస్టులు అంటున్నారు.

Updated On 26 Oct 2023 5:06 AM GMT
Ehatv

Ehatv

Next Story