భారతదేశం అపారమైన ఆర్థిక వ్యత్యాసాన్ని కలిగి ఉన్న దేశం, అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ కేంద్రాలను కలిగి ఉంది.

భారతదేశం అపారమైన ఆర్థిక వ్యత్యాసాన్ని కలిగి ఉన్న దేశం, అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ కేంద్రాలను కలిగి ఉంది. అయితే ఇంకా మన దేశం పేదరికంతో కొట్టుమిట్టాడుతోంది. వివిధ రంగాలలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, పారిశ్రామిక వృద్ధి, సరిపోని మౌలిక సదుపాయాలు , సామాజిక-ఆర్థిక అడ్డంకుల కారణంగా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ ఆర్థిక సవాళ్లతో పోరాడుతున్నాయి. భారతదేశంలోని 8 పేద రాష్ట్రాలను జాబితా ఇలా ఉంది.
బీహార్(Bihar): భారతదేశంలోని పేద రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, బీహార్ తలసరి GDP సుమారు రూ.46,000. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మూడో రాష్ట్రంగా బీహార్ ఉంది.
ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh): అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటైన ఉత్తరప్రదేశ్, తలసరి ఆదాయం రూ.65,000 కలిగి ఉంది.
జార్ఖండ్(Jharkhand): జార్ఖండ్‌లో ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి, అయినప్పటికీ దాని తలసరి GDP కేవలం రూ.75,000 మాత్రమే.
మేఘాలయ(Meghalaya) : తలసరి GDP దాదాపు రూ. 82,000. రాష్ట్రంలో అభివృద్ధిలేమీ, పేలవమైన మౌలిక సదుపాయాలను కలిగి ఉంది.
మణిపూర్(Manipur): తలసరి GDP సుమారు రూ. 82,000తో, రాష్ట్రం సామాజిక రాజకీయ, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది.
అస్సోం(Assam): అధిక జనసాంద్రత వల్ల తలసరి GDP సుమారు రూ. 86,000 మాత్రమే.
మధ్యప్రదేశ్(Madhya Pradesh): తలసరి GDP రూ. 98,000. పారిశ్రామిక వృద్ధి లేకపోవడంతో ఆర్థికాభివృద్ధి జరగలేదు.
జమ్మూకాశ్మీర్ (Jammu and Kashmir): తలసరి GDP రూ. 1, 04,000గా ఉంది. వ్యవసాయంపై ఆధారపడిన కారణంగా 10% పేదరికాన్ని కలిగి ఉంది.
