ఢిల్లీ-ఎన్‌సిఆర్(delhi-ncr)లోని 150కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
ఢిల్లీ-ఎన్‌సిఆర్(delhi-ncr)లోని 150కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 11 రోజుల తర్వాత నేడు ఎనిమిది ఆసుపత్రులు, ఐజిఐ విమానాశ్రయానికి ఈమెయిల్‌ల ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ ఆదివారం తెలిపింది.
ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-3, బురారీ హాస్పిటల్, సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్, గురు తేగ్ బహదూర్ హాస్పిటల్, బారా హిందూ రావ్ హాస్పిటల్, జనక్‌పురి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, దబ్రీస్ దాదా దేవ్ హాస్పిటల్, సివిల్ లైన్స్‌లోని అరుణా అసఫ్ అలీ ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయని సీనియర్ DFS అధికారి తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, సాయంత్రం 6 గంటలకు విమానాశ్రయ అధికారులకు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది.
బెదిరింపుల నేపథ్యంలో నగరంలోని అన్ని ఆసుపత్రులలో భద్రతను పెంచారు. విమానాశ్రయంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. అయితే ఇప్పటివరకు ఏ ప్రదేశం నుండి కూడా ఎటువంటి అనుమానస్పద వస్తువులు కనబడలేదని పోలీసులు తెలిపారు.