Miss World Competitions : మూడు దశాబ్దాల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు!
ఈసారి మిస్ వరల్డ్(Miss World Competitions) పోటీలకు భారత్ వేదికకాబోతున్నది. 71 ఎడిషన్ ప్రపంచ సుందరి పోటీలు ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు జరుగుతాయి. సుమారు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌లో ఈ పోటీలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

miss world
ఈసారి మిస్ వరల్డ్(Miss World Competitions) పోటీలకు భారత్ వేదికకాబోతున్నది. 71 ఎడిషన్ ప్రపంచ సుందరి పోటీలు ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు జరుగుతాయి. సుమారు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌లో ఈ పోటీలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ వేడుక న్యూఢిల్లీలో(New delhi) జరుగుతుందని, ముగింపు వేడుకలు మార్చి 9వ తేదీన ముంబాయిలో జరుగుతాయని చప్పారు. న్యూఢిల్లీలోని భారత్ మండపం సహా వివిధ వేదికల్లో పోటీ జరుగుతుంది. వివిధ దేశాలకు చెందిన 120 మంది అందాల భామలు వివిధ పోటీల్లో, దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భారత్ పట్ల తనకున్న ప్రేమ దాచలేనిదని, భారత్‌లో ప్రపంచ సుందరి పోటీలు జరగడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నదని మిస్ వరల్డ్ సంస్థ సీఈవో, అధ్యక్షురాలు జులియా మోర్లే తెలిపారు(Julia Morley).
