సమూహం ఎప్పుడూ సంబరమే! వేలాది మంది ఒక్కచోటకు చేరి ఆట పాటలతో అలరించడం వీక్షకులకు నేత్ర పర్వమే! అది సంప్రదాయ బృంద నృత్యాలే కావచ్చు. వాయిద్యాల సమ్మేళనమే కావచ్చు. ఏదైనా అదో ఆహ్లాదకరమైన ఆనందపు వేడుక.. ఉత్సాహభరితమైన గీతిక! అది మన బతుకమ్మే కావచ్చు. మన కూచిపూడే కావచ్చు. తమిళుల భరతనాట్యమే కావచ్చు. కేరళవాసుల కైకొట్టికళే కావచ్చు. లావణీయే కావచ్చు.. ఏ నృత్యమైనా అందరూ ఒక్కచోటకు చేరి చేస్తేనే సంబరం.

సమూహం ఎప్పుడూ సంబరమే! వేలాది మంది ఒక్కచోటకు చేరి ఆట పాటలతో అలరించడం వీక్షకులకు నేత్ర పర్వమే! అది సంప్రదాయ బృంద నృత్యాలే కావచ్చు. వాయిద్యాల సమ్మేళనమే కావచ్చు. ఏదైనా అదో ఆహ్లాదకరమైన ఆనందపు వేడుక.. ఉత్సాహభరితమైన గీతిక! అది మన బతుకమ్మే కావచ్చు. మన కూచిపూడే కావచ్చు. తమిళుల భరతనాట్యమే కావచ్చు. కేరళవాసుల కైకొట్టికళే కావచ్చు. లావణీయే కావచ్చు.. ఏ నృత్యమైనా అందరూ ఒక్కచోటకు చేరి చేస్తేనే సంబరం.
మొన్ననే అంటే మంగళవారం(Tuesday) రోజున మలయాళీలు ఓనం(Onam) పండుగను ఘనంగా జరుపుకున్నారు. పూల రంగవల్లికల పూక్కాలమ్‌లతో, సంప్రదాయ నృత్యమైన కైకొట్టికళితో కేరళ అంతా శోభాయమానంగా కనిపించింది. ఎలాగూ పండుగ చేసుకుంటున్నాం కదా! పాత రికార్డులను చెరిపేసి కొత్త రికార్డును సృష్టిస్తే ఎలా ఉంటుందనుకున్నారు మలయాళీ మగువలు. ఆలోచన రాగానే పది వేల మంది ఒక్క చోటకు చేరి కైకొట్టికళిని(Kaikottikali) ప్రదర్శిద్దామనుకున్నారు. అందరికీ కబురుపంపారు. 7,026 మంది రెక్కలు కట్టుకుని వాలిపోయారు. వారంతా ఒక చోటుకు చేరి తమ సంప్రదాయ నృత్యమైన కైకొట్టికళిని జనరంజకంగా ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. దాంతో పాటే సరికొత్త రికార్డును నెలకొల్పి లింకా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో(Limka Book Of records) చోటు సంపాదించుకున్నారు.
మొదట మూడు వేల మందితో మొదలైన ఈ సామూహిక నృత్య విన్యాసం తర్వాత అయిదు వేల మందికి చేరుకుంది. అదో రికార్డు. అటు పిమ్మట ఆరున్నర వేల మందితో ఆ రికార్డును వారే చెరిపేశారు. ఏడాదికేడాది సంఖ్యతో పాటు ఉత్సాహమూ పెరుగుతోంది. ఎక్కడో దూరతీరాలలో ఉన్నవారు కూడా కైకొట్టికళిలో పాలుపంచుకోవడానికి వచ్చారు. బుధవారం సాయంత్రం త్రిసూర్‌లోని కుట్టనెల్లూరు ప్రభుత్వ కళాశాల ఈ మహోత్సవానికి వేదికగా నిలిచింది. ఏడు వేల మందికి పైగా మహిళలు సుమారు 11 నిమిషాల పాటు చేసిన తిరువాదిరికళి నృత్యం చూపరులను కట్టిపడేసింది. రికార్డు ప్రకటన రాగానే ఇందులో చాలా మంది ఆనందోగ్వేగాలకు లోనయ్యారు. కొందరి కళ్లలో సన్నటి తడి కూడా కనిపించింది. ఆకాశంవైపు చూస్తూ ముకుళిత హస్తాలతో ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు కొందరు. టూరిజం డిపార్ట్‌మెంట్‌తో పాటు త్రిసూర్‌ జిల్లా అధికారులు, కార్పొరేషన్‌ అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
కథాకళి, మోహినీఆట్టం లాగే కైకొట్టికళి కూడా కేరళకు చెందిన ఓ సంప్రదాయ నృత్యం . ఈ నృత్యాన్ని తిరువాదిరికళి అని కూడా అంటారు. ధనుర్మాసంలో తిరువాదిర రోజున చేసే నృత్యం కాబట్టే తిరువాదిరికళి అన్న పేరు వచ్చింది. మలయాళంలో కై అంటే చేయి. కొట్టి అంటే చేతులు చరచడం. ఓ అందమైన రంగవల్లిక మధ్యలో నిలా విలక్కు అనే దీపం. చుట్టూ వలయాకారంలో తిరుగుతూ లయాత్మకంగా పరస్పర సమన్వయంతో చేతులు చరుస్తూ, పాటలు పాడుతూ చేసే నృత్యమే కైకొట్టికళి. పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ పాటలు పాడతారు.

Updated On 31 Aug 2023 4:10 AM GMT
Ehatv

Ehatv

Next Story