సంక్రాంతి(Sankranti) పండుగను దేశమంతటా వివిధ రకాలుగా జరుపుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో సంక్రాంతి జోరుగా జరుగుతుంది. తమిళనాడులో అయితే పొంగల్ వేడుకలు వైభవంగా జరిగాయి. పండుగ రోజున కూతురు(Daughter), అల్లుడికి(Son in law) కొత్త బట్టలు పెట్టడం, కానుకలు ఇవ్వడం చేస్తుంటారు. పుద్దుకొట్టై ప్రాంతానికి చెందిన చెల్లాదురై అనే వ్యక్తి కూడా సంక్రాంతి పండుగ రోజున కూతురుకు కానుకలు ఇవ్వడం కోసం పెద్ద సాహసమే చేశాడు.
సంక్రాంతి(Sankranti) పండుగను దేశమంతటా వివిధ రకాలుగా జరుపుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో సంక్రాంతి జోరుగా జరుగుతుంది. తమిళనాడులో అయితే పొంగల్ వేడుకలు వైభవంగా జరిగాయి. పండుగ రోజున కూతురు(Daughter), అల్లుడికి(Son in law) కొత్త బట్టలు పెట్టడం, కానుకలు ఇవ్వడం చేస్తుంటారు. పుద్దుకొట్టై ప్రాంతానికి చెందిన చెల్లాదురై అనే వ్యక్తి కూడా సంక్రాంతి పండుగ రోజున కూతురుకు కానుకలు ఇవ్వడం కోసం పెద్ద సాహసమే చేశాడు. 70 ఏళ్ల వయసున్న ఆ పెద్దమనిషి 14 కిలోమీటర్లు సైకిల్‌పై(Cycle) ప్రయాణించి కూతురుకు సంక్రాంతి కానుకను అందించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెల్లాదురై వ్యవసాయం చేస్తుంటాడు. ఈయన కూతురు సుందరపాల్‌కు 2006లో పెళ్లయ్యింది. పెళ్లయి పదేళ్లు అయినా ఆమెకు పిల్లలు కలగలేదు. 2016లో ఆమెకు కవలలు పుట్టారు. చెల్లాదురై ఆనందం అంతా ఇంతా కాదు. అప్పట్నుంచి ప్రతి సంక్రాంతికి కూతురు ఇంటికి వెళ్లి కానుకలు ఇవ్వసాగారు. కూతురుకు, అల్లుడికి, పిల్లలకు కొత్త బట్టలు ఇస్తాడు. అక్కడే పొంగల్‌ను ఘనంగా జరుపుకుంటాడు. తమిళనాడులో పొంగల్ రోజున చెరకు గడలతో పాయసం వండుకుంటారు. అందుకే కూతురు కోసం చెరుకు గడల గుత్తిని తలపై పెట్టుకుని 14 కిలోమీటర్ల పాటు ప్రయాణించి ఆమె ఇంటికి వెళ్లాడు చెల్లాదురై. చెరకు గడలు ఆమెకు అందించాడు. మనవరాళ్లకు కొత్త బట్టలు కొనిచ్చాడు. చెల్లాదురై తలపై చెరుకు గడలు పెట్టుకుని సైకిల్ తొక్కుతున్న దృశ్యాలను వీడియోలో బంధించాడో యువకుడు. తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో(Social media) పోస్ట్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట అది చక్కర్లు కొడుతోంది.