నోట్ల రద్దుకు నేటితో ఏడేళ్లు పూర్తి. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు అంటే నవంబర్ 8న 2016లో రాత్రి 8 గంటల సమయలో అకస్మాత్తుగా ప్రధాని మోడీ(PM Modi) ఒక ప్రకటన చేశారు. దేశ ప్రజలందరినీ విస్మయానికి గురిచేశారు. ప్రజలందరూ ఉలిక్కి పడేలా మోడీ నిర్ణయం వెలువడింది. మోడీ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు చెలరేగాయి.

నోట్ల రద్దుకు నేటితో ఏడేళ్లు పూర్తి. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు అంటే నవంబర్ 8న 2016లో రాత్రి 8 గంటల సమయలో అకస్మాత్తుగా ప్రధాని మోడీ(PM Modi) ఒక ప్రకటన చేశారు. దేశ ప్రజలందరినీ విస్మయానికి గురిచేశారు. ప్రజలందరూ ఉలిక్కి పడేలా మోడీ నిర్ణయం వెలువడింది. మోడీ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు చెలరేగాయి. అసలు మోడీ ప్రకటన ఏంటంటే పెద్ద నోట్ల రద్దు. నోట్ల రద్దు ప్రకటనతో కొందరి జీవితాలు అతలాకుతలమయ్యాయి. మున్ముందు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.

సరిగ్గా ఏడేళ్ల క్రితం ప్రధాని మోడీ చేసిన ప్రకటన డీమానిటైజేషన్(Demonetisation). అప్పటి వరకూ చెలామణీలో ఉన్న రూ. 500, వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రకటించారు. అప్పుడే సరికొత్తగా 2000 నోటును ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. పాత 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు ఇకపై చెల్లని కాగితాలే అని తెలిపారు. అయితే ప్రజల దగ్గర ఉన్న రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి గడువిచ్చారు. అది కూడా రోజుకు కొంత మొత్తాన్ని మార్చుకునేందుకు గడువిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల వద్దకు ప్రజలు ఎగబడేవారు. అర్ధరాత్రి నుంచే బ్యాంకుల వద్దకు చేరుకుని పడిగాపులు కాసేవారు. దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల లాఠీచార్జీలు కూడా జరిగాయి. సామాన్యుడు తన వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు నానా తంటాలు పడ్డారు. కొందరు క్యూలో నిలబడి ప్రాణాలు కూడా కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ ప్రకటనపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి. బాగా డబ్బున్న ధనికులకు మాత్రం నోట్లు మార్చుకునేందుకు సులభంగానే ఉండేది. కొందరి ఇళ్లల్లో కోట్లలో కొత్త 2 వేల నోట్లు కూడా దర్శనమిచ్చాయి. వెయ్యి నోటు రద్దు చేసి రూ.2 వేల నోటును ఎందుకు ప్రవేశపెట్టినట్లు అని కొందరు విమర్శించారు కూడా. దేశంలో కొత్త 500, 2000, 200, 100 నోట్లను అత్యంత పకడ్బందీగా తీసుకొస్తున్నామని, అధునాతన సెక్యూరిటీతో కొత్త నోట్లను ప్రవేశపెడతామని కేంద్రం ప్రకటించింది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన రూ.500, రూ.2 వేల నోట్లను కూడా నకిలీవి చేశారు మన ప్రబుద్ధులు.

నల్ల ధనాన్ని బయటకు తీసేందుకు ఈ నోట్ల రద్దు ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా.. నోట్ల రద్దు ఫలితాలు మరోలా వచ్చాయి కన్పించాయి. నోట్ల మార్పిడి ద్వారా దాదాపు 98 శాతానికి పైగా వెనక్కి చేరిపోయాయి. అయితే నకిలీ నోట్లలో వెయ్యి రూపాయల నోటు బాగా చెలామణిలో ఉండేది. నోట్ల రద్దు తర్వాత వెయ్యి నోటు మాయమైంది. మరోవైపు కొత్తగా ప్రవేశ పెట్టిన రూ.2 వేల నోట్లను కూడా ఈ మధ్యనే కేంద్రం రద్దు చేసింది. ప్రజల వద్ద ఉన్న 2 వేల నోట్లను మార్చుకోవాలని గడువు ఇచ్చింది. దీంతో 2 వేల నోటు కూడా దేశంలో కనుమరుగైంది.

Updated On 8 Nov 2023 2:40 AM GMT
Ehatv

Ehatv

Next Story