పశ్చిమ బెంగాల్‌లోని(West bengal) పశ్చిమ 24 పరగణాల(Pargana) జిల్లాలోని దత్‌పుకూర్ ప్రాంతంలోని బాణసంచా ఫ్యాక్టరీలో(Crackers Factory) ఆదివారం ఉదయం జరిగిన పేలుడులో(Blast) ఏడుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Crackers Factory Blast
పశ్చిమ బెంగాల్‌లోని(West bengal) పశ్చిమ 24 పరగణాల(Pargana) జిల్లాలోని దత్‌పుకూర్ ప్రాంతంలోని బాణసంచా ఫ్యాక్టరీలో(Crackers Factory) ఆదివారం ఉదయం జరిగిన పేలుడులో(Blast) ఏడుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రత చాలా బలంగా ఉండడంతో ఆ ప్రాంతంలోని పలు ఇళ్లు(Houses) కూడా దెబ్బతిన్నాయని వెల్లడించారు.
ఫ్యాక్టరీలో పేలుడు చాలా బలంగా ఉందని.. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని.. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారని.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పేలుడు ఉదయం 10 గంటల ప్రాంతంలో సంభవించింది. బాణసంచా ఫ్యాక్టరీకి అనుమతులు లేవని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
