ఆత్మహత్య(Suicide) చేసుకుంటే మరో జన్మ ఎత్తొచ్చన్న ఆలోచనలతో శ్రీలంకలో(Sri Lanka) ఓ పాస్టర్(Pastor) సహా ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకోవడం వల్ల పునర్జన్మ(reincarnation) ఉంటుందని ఆ పాస్టర్‌ బోధించేవాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆయన మొదట్లో ఓ కెమికల్ ల్యాబొరేటరీలో(Chemical laboratory) ఉద్యోగిగా పనిచేసి.. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో బోధనలు చేసేవారు.

ఆత్మహత్య(Suicide) చేసుకుంటే మరో జన్మ ఎత్తొచ్చన్న ఆలోచనలతో శ్రీలంకలో(Sri Lanka) ఓ పాస్టర్(Pastor) సహా ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకోవడం వల్ల పునర్జన్మ(reincarnation) ఉంటుందని ఆ పాస్టర్‌ బోధించేవాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆయన మొదట్లో ఓ కెమికల్ ల్యాబొరేటరీలో(Chemical laboratory) ఉద్యోగిగా పనిచేసి.. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో బోధనలు చేసేవారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా డిసెంబర్ 28న ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. హొమగామ ప్రాంతంలోని తన ఇంట్లో ఆయన విషం తీసుకుని చనిపోయినట్లు దర్యాప్తులో తేలింది. పాస్టర్ భార్య కూడా తన ముగ్గురు పిల్లలకు భోజనంలో విషం(Poison) కలిపి పెట్టి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

పోలీసులు తొలుత భర్త మరణాన్ని తట్టుకోలేకపోయిన భార్య తన బిడ్డలకు విషం కలిపిన భోజనం పెట్టి, తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావించారు. ఈ ఆత్మహత్యలపై అనుమానాలు రావడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేయగా ఈ వ్యహారం బయటపడింది. ఈ సందర్భంగా ఆ కుటుంబం అంత్యక్రియలకు హాజరైన పీర్తి కుమారా అనే వ్యక్తిని పోలీసులు విచారించారు. పాస్టర్‌ బోధనలకు తాను కూడా హాజరయ్యాయని పోలీసులు పీర్తి కుమారా చెప్పారు. పాస్టర్ బోధనలు ఆత్మహత్యకు ప్రేరేపించేలా ఉండేవని పోలీసులకు స్టేట్‌మెంట్‌లో ఇచ్చారు. పోలీసుల విచారణ తర్వాత పీర్తి కుమారా కూడా ఆత్మహత్య స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాస్టర్‌ కుటుంబమే కాకుండా మరో ఇద్దరు కూడా ఇలా ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు.

Updated On 6 Jan 2024 1:10 AM GMT
Ehatv

Ehatv

Next Story