చెన్నైలో(Chennai) ఏడు అడుగుల పాము(Snake) కలకలం రేపింది. పార్క్‌ చేసి ఉన్న ఓ స్కూటీలో(Scooty) ఏడు అడుగుల పాము దూరింది. స్కూటీ ముందు భాగంలో పామును చూసి ఒక్కసారిగా స్కూటీ యజమాని భయాందోళనకు గురయ్యాడు. అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేశాడు. దీంతో అధికారులు, సిబ్బంది వచ్చి దానిని తీసేందుకు కొద్దిసేపు కష్టపడ్డారు.

చెన్నైలో(Chennai) ఏడు అడుగుల పాము(Snake) కలకలం రేపింది. పార్క్‌ చేసి ఉన్న ఓ స్కూటీలో(Scooty) ఏడు అడుగుల పాము దూరింది. స్కూటీ ముందు భాగంలో పామును చూసి ఒక్కసారిగా స్కూటీ యజమాని భయాందోళనకు గురయ్యాడు. అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేశాడు. దీంతో అధికారులు, సిబ్బంది వచ్చి దానిని తీసేందుకు కొద్దిసేపు కష్టపడ్డారు. స్కూటీ ముందు భాగాలను తొలగించి పాముకు హానీ కలగకుండా.. నెమ్మదిగా పామును పట్టుకొని సంచిలో వేసుకొని.. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ మధ్య వచ్చిన తుఫాన్‌(Typhoon) వల్ల పాము చెన్నై నగరానికి కొట్టుకు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. తుఫాను ఫలితంగా ఈ నెల ప్రారంభంలో కురిసిన భారీ వర్షాల తర్వాత నగరంలోని అనేక ప్రాంతాలు వర్షపునీటిలో మునిగిపోయాయి. తుఫాను కారణంగా ఏర్పడిన వరదల మధ్య నగరంలో ఈ మధ్యనే భారీ మొసలి కనిపించింది. నగరంలోని పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయి ఉండడంతో పాములు, మొసలి ఘటనలు చూశాక ప్రజలు భయాందోళనలో ఉన్నారు. స్కూటీలో పాము వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది..

Updated On 12 Dec 2023 2:39 AM GMT
Ehatv

Ehatv

Next Story