మహారాష్ట్రలోని(Maharahstra) పూణెలో(Pune) 63 ఏళ్ల దత్తాత్రేయ విష్ణు తాంబే(Dattatreya Vishnu Tambe) కనిపించకుండా పోయాడు.

మహారాష్ట్రలోని(Maharahstra) పూణెలో(Pune) 63 ఏళ్ల దత్తాత్రేయ విష్ణు తాంబే(Dattatreya Vishnu Tambe) కనిపించకుండా పోయాడు. ఈ ఘటన 2021 డిసెంబర్‌లో జరిగింది. అతడు ఎక్కడికి వెళ్లాడో కుటుంబసభ్యులకు తెలియదు. అతడి కోసం అన్ని చోట్లా వెతికారు. అన్ని రకాలుగా ప్రయత్నించారు. వెతికి వెతికి విసిగిపోయారు. చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోవడం దత్తాత్రేయకు అలవాటే కాబట్టి ఏదో ఒక రోజు అతడే ఇంటికి తిరిగి వస్తాడని అనుకున్నారు.

లేటెస్ట్‌గా విష్ణుతాంబే కుటుంబసభ్యులకు ఆనందకరమైన వార్త తెలిసింది. అధికార శివసేన(shivasena) ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) అకౌంట్‌లో దత్తాత్రేయ విష్ణు తాంబే కనిపించాడు. మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం ఇటీవల ముఖ్యమంత్రి తీర్థ దర్శన్(Thirtha darshan) యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలో ప్రధాన మతపరమైన ప్రదేశాలకు వెళ్లే సీనియర్‌ సిటిజన్లకు 30 వేల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తుంది ప్రభుత్వం. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అందుకోసమే ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడమే కాకుండా దానికి విస్తృతమైన ప్రచారాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం ఇచ్చిన ఓ ప్రకటనలో దత్తాత్రేయ విష్ణుతాంబే కనిపించాడు. అది చూసి అతడి కుమారుడు భరత్‌ ఆశ్చర్యపోయాడు. షిక్రాపూర్‌లో స్వీట్‌షాపు నడుపుతున్న భరత్‌కు ఫ్రెండ్‌ ఒకరు దాన్ని వాట్సప్‌లో పంపాడట! ' ఆ స్క్రీన్‌షాట్‌ చూసి నమ్మలేకపోయా. ప్రభుత్వ తీర్థ దర్శన్ పథకం ప్రకటనలో మా నాన్న కనిపించారు' అని భరత్‌ తెలిపాడు. తమ తండ్రిని తమ దగ్గరకు చేర్చాలని భరత్‌ ముఖ్యమంత్రి షిండేను కోరారు. తమ తండ్రి సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నాడని తెలిసినందుకు ఆనందంగా ఉందన్నారు.

Eha Tv

Eha Tv

Next Story