త్రిపురలోని(Tripura) ఉనకోటి జిల్లాలో విద్యుత్ తీగలు(Current wires) తగిలి రథానికి(Chariot)మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 6 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు తెలియజేశారు. జగన్నాథుని 'ఉల్టా రథయాత్ర' ఉత్సవం సందర్భంగా కుమార్‌ఘాట్(Kumarghat) ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా 'రథం' లాగారు. ఈ రథం ఇనుముతో చేయబడింది.
త్రిపురలోని(Tripura) ఉనకోటి జిల్లాలో విద్యుత్ తీగలు(Current wires) తగిలి రథానికి(Chariot)మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 6 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు తెలియజేశారు. జగన్నాథుని 'ఉల్టా రథయాత్ర' ఉత్సవం సందర్భంగా కుమార్‌ఘాట్(Kumarghat) ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా 'రథం' లాగారు. ఈ రథం ఇనుముతో చేయబడింది. ఊరేగింపు సందర్భంగా 'రథం' ప్రమాదవశాత్తూ 133కేవీ ఓవర్ హెడ్ కేబుల్ తగిలి మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారని, 15 మంది గాయపడ్డారని, వారిని ఆసుపత్రిలో చేర్చామని అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ జ్యోతిష్మాన్ దాస్ చౌదరి వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. మృతులలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలియజేశారు. ఘటనపై త్రిపుర సీఎం మాణిక్ సాహా సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని అన్నారు.