చత్తీస్‌గఢ్‌లో సతీ సహగమనం... ఎలా జరిగిందంటే..!
సతీ సహగమనం(Sathi sagamanam) అనే దురాచారం అంతరించింది. ఇన్నాళ్లకు మళ్లీ చత్తీస్‌గఢ్‌లో(chhattisgarh) వెలుగు చూసింది. రాయగఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. భర్త అంత్యక్రియల సమయం నుంచి 58 ఏళ్ల మహిళ కనిపించకుండా పోయింది. దీనిపై చక్రధర్‌నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ కూడా రిజిస్టరయ్యింది. 65 ఏళ్ల జైదేశ్ గుప్తా ఆదివారం కేన్సర్‌తో కన్నుమూశాడు. ఆ రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన భార్య గులాబీ గుప్తా ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. తెల్లారి కూడా ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. చివరకు ఆమెకు సంబంధించిన చీర, చెప్పులు, కళ్లజోడు వగైరాలు భర్త చితి దగ్గర కనిపించాయి. దీన్నిబట్టి ఆమె భర్త చితిలో దూకి ఆత్మహత్ చేసుకున్నదేమోనని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. చితి నుంచి నమూనాలను సేకరించిన ఫోరెన్సిక్ బృందం వాటిని లాబ్‌కు పంపింది.