Nepal Sri Ram Stamp : రామాలయ ప్రారంభోత్సవాన్ని 57 ఏళ్ల కిందటే ఊహించిన నేపాల్!
అయోధ్య(Ayodhya) రామాలయంలో ఈ నెల 22వ తేదీన బాలరాముని(Ram Lalla) విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేపాల్‌కు(Nepal) చెందిన 57 ఏళ్ల నాటి సీతారాముల స్టాంపు(Stamp) వెలుగులోకి వచ్చింది. సరిగ్గా 1967, ఏప్రిల్ 18న శ్రీరామ నవమి(Sri Ram Navami) రోజున ఈ స్టాంపును విడుదల చేశారు. ఈ స్టాంప్‌పై నేపాల్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అనుసరించే హిందూ క్యాలెండర్ అయిన విక్రమ సంవత్ 2024 సంవత్సరంలో ఉంది.
అయోధ్య(Ayodhya) రామాలయంలో ఈ నెల 22వ తేదీన బాలరాముని(Ram Lalla) విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేపాల్‌కు(Nepal) చెందిన 57 ఏళ్ల నాటి సీతారాముల స్టాంపు(Stamp) వెలుగులోకి వచ్చింది. సరిగ్గా 1967, ఏప్రిల్ 18న శ్రీరామ నవమి(Sri Ram Navami) రోజున ఈ స్టాంపును విడుదల చేశారు. ఈ స్టాంప్‌పై నేపాల్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అనుసరించే హిందూ క్యాలెండర్ అయిన విక్రమ సంవత్ 2024 సంవత్సరంలో ఉంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 1967లో విడుదలైన ఈ స్టాంప్‌పై ఈ ఏడాది రాసి ఉంది. హిందువులు అనుసరించే విక్రమ్ సంపత్, గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే 57 ఏళ్లు ముందుంటుంది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు వైభవోపేతంగా సాగుతున్న సమయాన ఈ స్టాంప్ వెలుగులోకి రావడం రకరకాల ఊహాగానాలుకు తెరతీసింది. అంటే అయోధ్యలో ఇప్పుడు జరుగుతున్న రామాలయ ప్రారంభోత్సవాన్ని నేపాల్ 57 ఏళ్ల క్రితమే ఊహించిందా? అనుకుంటున్నారు చాలా మంది. అది కూడా సరిగ్గా ఈ సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ స్టాంప్‌పై ఉన్న సంవత్సరం ఈ ఏడాదిని పోలి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ స్టాంప్ విడుదలైన ఏడాది ఆలయ ప్రతిష్టాపన సంవత్సరంతో సరిపోలింది. 2024లో రాముడు తన జన్మభూమి అయిన అయోధ్యకి తిరిగి వస్తాడని 57 ఏళ్ల కిత్రం నేపాల్‌లో ఈ స్టాంప్ విడుదలైనప్పుడు ఎవరూ ఊహించి ఉండరు కదా!. ఇదిలా ఉండగా, ఈ నెలలో జరగనున్న రామ ప్రాణ ప్రతిష్టాపన కోసం 56 అంగుళాల పొడవుతో సింహగర్జనతో కూడిన డ్రమ్ అయోధ్యకు పెద్ద ఊరేగింపుగా వచ్చింది. దీన్ని ఆలయంలో ఉంచుతారు.