ఓ తల్లి 55 ఏళ్ల వయసులో ఆటో నడుపుతుంది. అర్ధరాత్రి 1:30 వరకు ఆటో నడిపి సంపాదించిన సొమ్ముతో నెట్టుకొస్తోంది.

ఓ తల్లి 55 ఏళ్ల వయసులో ఆటో నడుపుతుంది. అర్ధరాత్రి 1:30 వరకు ఆటో నడిపి సంపాదించిన సొమ్ముతో నెట్టుకొస్తోంది. ఒక్క కొడుకు పనిచేయకపోగా, తల్లి సంపాదించిన డబ్బును లాక్కెళ్తుండడంతో చేసేదేమీ లేక ఆటో నడపుతూ ఉపాధి పొందుతోంది ఓ తల్లి. మహిళ ఆటో నడిపే వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని లక్షల్లో ఈ వీడియోకు వ్యూస్‌ వచ్చి మహిళ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ క్రియేటర్ ఆయుష్ గోస్వామి(Ayush Goswami) 55 ఏళ్ల ఆమెను జీవనోపాధి కోసం ఏమి చేస్తుందో అడిగే షాట్‌తో క్లిప్ ప్రారంభమవుతుంది. అర్థరాత్రి వరకు ఆటో నడుపుతానని సమాధానం చెప్పింది. ఇంత ఆలస్యంగా ఆటో ఎందుకు నడుపుతారని ఆమె ప్రశ్నించారు. దీనికి ఆమె, ఇంటి బాధ్యతలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది కదా అంది. ఉన్న ఒక్క కొడుకు పని చేయడు, సోమరిపోతులా మారాడు, పైగా తాను సంపాదించిన డబ్బును కూడా జల్సాల కోసం లాక్కెళ్తాడని, తనకు గౌరవం కూడా ఇవ్వడని వీడియోలో వివరించింది. అర్ధరాత్రి వరకు మీరు ఆటో నడపడానికి చాలా ధైర్యం కావాలి కదా అని ప్రశ్నిస్తే ఒకరిని డబ్బు అడుక్కొని బతకడం కంటే కష్టపడి పనిచేసి నిజాయితీగా బతికాలన్నదే తన సంకల్పమని స్పష్టంగా చెప్పింది. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళ కొడుకుపై దుమ్మెత్తి పోస్తున్నారు. పలువురు సెలెబ్రెటీలు, నెటిజన్లు మహిళ పట్ల సానుకూలంగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది కాదా ఇన్స్పిరేషన్‌ అని కొనియాడుతున్నారు.

ehatv

ehatv

Next Story