అగ్నిసెగలతో రగిలిపోతున్న మణిపూర్‌(Manipur) ఇంకా చల్లారలేదు. గిరిజనులు(Tribals), గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు(shoot out) జరిగాయి. ఇప్పటికే 54 మంది అల్లర్లలో చనిపోయాడు. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

అగ్నిసెగలతో రగిలిపోతున్న మణిపూర్‌(Manipur) ఇంకా చల్లారలేదు. గిరిజనులు(Tribals), గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు(shoot out) జరిగాయి. ఇప్పటికే 54 మంది అల్లర్లలో చనిపోయాడు. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. బుల్లెట్‌ గాయాలతో చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం అదనపు బలగాలను రంగంలోకి తీసుకొచ్చింది. ఆర్మీ దళాలు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, కేంద్ర పోలీసు బలగాలు శాంతిభద్రతలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్‌ పెట్టాయి. ఇప్పటి వరకు 13 వేల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చురాచంద్‌పూర్ జిల్లాలోని సైటన్‌లో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. గచురాచాంద్‌పూర్, మోరే, కక్చింగ్, కాంగ్‌పోక్పీ వంటి ప్రాంతాలను కేంద్ర బలగాలు తమ ఆధినంలోకి తీసుకున్నాయి.

మణిపూర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది ఉన్న మెయితీలు తమకు షెడ్యూల్డు తెగల హోదాను కల్పించాలని ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. మెయితీలు చేస్తున్న డిమాండ్‌పై నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని గత నెల మణిపూర్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొదటి నుంచి మెయితీల డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్న గిరిజనులకు హైకోర్టు ఆదేశం ఆగ్రహం తెప్పించింది. గిరిజనలు నిరసనలకు దిగారు.

ఆల్‌ ట్రైబల్‌ స్టూడెంట్ యూనియన్‌(All Tribal Student Union) మణిపూర్‌ గిరిజన సంఘీభావ కవాతును నిర్వహించింది. ఇందులో నాగాలు, జోమీలు, కుకీలు పాల్గొన్నారు. ఇందులో సాయుధులు రెచ్చిపోయారు. మెయితీ తెగపై దాడులు చేశారు. వారు కూడా తిరగబడ్డారు. గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. హింస ప్రజ్వరిల్లింది. అనేక ఇళ్లు, దుకాణాలు ధ్వంసం అయ్యాయి. ఇంఫాల్ లోయలో కొన్ని ప్రార్థనా స్థలాలను కూడా ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం అక్కడ కనిపిస్తే కాల్చివేత్త ఉత్తర్వులు ఉన్నాయి.

Updated On 6 May 2023 6:22 AM GMT
Ehatv

Ehatv

Next Story