ప్రేమకు ఎల్లలు ఉండవంటారు.. ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ ఏ నెంబర్‌ అంటారు..

ప్రేమకు ఎల్లలు ఉండవంటారు.. ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ ఏ నెంబర్‌ అంటారు.. ఇదే నిజమని నిరూపించింది ఓ బ్రెజిల్ మహిళ(Brazil women). 51 ఏళ్ల ముసలి వయసులో యుక్త వసున్న యువకుడి ప్రేమలాలలో పడింది. అప్పటికే ఆమెకు భర్త పిల్లలు కూడా ఉన్నారు. అయినా వారిని వదిలేసి ప్రియుడి కోసం దేశాన్ని వదిలేసి భారత్‌కు(India) వచ్చేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గడ్(Chhattisgarh) లోని భిండ్ నగరంలో జరిగింది.

బ్రెజిల్‌కు చెందిన 51 సంవత్సరాల ఓ మహిళ రోజీ నాయిద్ షికేరా తన భర్త, 32 ఏళ్ల కొడుకుతో కలిసి ఉంటోంది. సొంత ఇల్లు, కుటుంబంతో సవ్యంగా కాపురం నడుస్తోంది. భర్త, కొడుకు రోజూ ఉద్యోగం కోసమని వెళ్లేవారు. దీంతో ఒంటరిగా ఉంటున్న రోజీ నాయిద్‌ 2023లో భారతదేశ పర్యటనకు వచ్చింది. గుజరాత్‌లోని కచ్‌లో పర్యటించే సమయంలో అక్కడ ఆమెకు పవన్‌ గోయల్‌ (30) అనే యువకుడితో పరిచయ ఏర్పడింది. ఇంగ్లీష్ రాక ఇబ్బందులు పడుతుంటే ఆమెకు సాయంగా ఉన్నాడు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం బలంగా నాటుకుపోయింది. అది రానురాను ప్రేమ పల్లకి ఎక్కింది. ఇద్దరికీ 21 ఏళ్ల గ్యాప్‌ ఉన్నా కానీ.. అది వారి ప్రేమకు అడ్డురాలేదు. ఇద్దరూ ప్రేమలో మునిగిపోయారు. కానీ మహిళకు అప్పటికే భర్త, కొడుకు ఉన్నారు. ఆ తర్వాత రోజీ తన దేశం వదిలి వెళ్లిపోయింది. ఇద్దరూ సోషల్‌ మీడియాలో కనెక్ట్‌ అయ్యారు. సోషల్‌ మీడియా ద్వారా రోజూ మాట్లాడుకునేవారు. ఇద్దరి మధ్య రోజురోజుకూ ప్రేమ మరింత వికసించింది. పవన్‌ గోయల్‌ను విడవలేకపోయింది. ఇక ఇదే విషయాన్ని తన భర్తకు చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. అయినా రోజీ తాను అనుకున్నట్లే తన భర్తను, కొడుకును వదిలేసి ఇండియా వచ్చేసింది. పవన్‌ కూడా రోజీ కోసం తహతహలాడాడు. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పి కుటుంబసభ్యులకు ఒప్పించాడు. తమ పెళ్లికి అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. వివాహం తర్వాత ఇక్కడే స్థిరపడిపోవాలని ఈ జంట నిర్ణయించుకుంది.

Eha Tv

Eha Tv

Next Story