కేరళలో(Kerala) ఓ అయిదేళ్ల చిన్నారి బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబాతో(Brain Eating amoeba) చనిపోయింది. ఈ నెల 1వ తేదీన, మళ్లీ 10వ తేదీన ఆ బాలిక స్థానికంగా ఉన్న చెరువులో(Lake) స్నానం చేసింది. కలుషితమైన ఆ నీటిలో ఉన్న ఫ్రీ లివింగ్‌ అమీబా ఆమె ముక్కు నుంచి శరీరంలోకి వెళ్లింది. ఆ తర్వాత మెదడుపై(Brain) తీవ్ర ప్రభావం చూపినట్టు వైద్యులు గుర్తించారు.

కేరళలో(Kerala) ఓ అయిదేళ్ల చిన్నారి బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబాతో(Brain Eating amoeba) చనిపోయింది. ఈ నెల 1వ తేదీన, మళ్లీ 10వ తేదీన ఆ బాలిక స్థానికంగా ఉన్న చెరువులో(Lake) స్నానం చేసింది. కలుషితమైన ఆ నీటిలో(Polluted water) ఉన్న ఫ్రీ లివింగ్‌ అమీబా ఆమె ముక్కు నుంచి శరీరంలోకి వెళ్లింది. ఆ తర్వాత మెదడుపై(Brain) తీవ్ర ప్రభావం చూపినట్టు వైద్యులు గుర్తించారు. బాలిక చెరువులో స్నానం చేసిన విషయం కుటుంబసభ్యులకు తెలుసు కానీ ఇలాంటి వ్యాధి ఒకటి సోకుతుందని వారు అనుకోలేదు. సకాలంలో వ్యాధిని గుర్తించి ఉంటే ఆ పాప బతికేదేమో! వైద్య చికిత్స అందించడంలో ఆలస్యం జరగడంతో ఆ చిన్నారి చనిపోయిందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధి చాలా దేశాలలో ఉంది. బ్యాక్టీరియా వర్గానికే చెందిన ఓ రకమైన అమీబాతో ఈ వ్యాధి సోకుతుంది. ఇది పరాన్నజీవి కాదు. కలుషితమైన నీటిలో బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా ఉంటుంది. ముక్కు లేదా నోటి ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశించి నెమ్మదిగా మెదడును పని చేయకుండా చేస్తుంది. అందుకే దీన్ని మెదడును తినే అమీబా అంటారు. ఈ వ్యాధి సోకిన వారికి ముందుగా తీవ్ర జ్వరం వస్తుంది. భరించలేనంత తలనొప్పితో పాటు వాంతులు అవుతాయి. వెంటనే చికిత్స చేయకపోతే చనిపోయే ప్రమాదం ఉంది. కేరళలో ఇంతకు ముందు కూడా ఇలాంటి కేసులు బయటపడ్డాయి. 2017లో ఒకసారి, నిరుడు మరోసారి బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యాధిని అమీబిక్‌ మెనింగోన్సిఫాలిటీస్‌ అని అంటారు.

Updated On 22 May 2024 12:34 AM GMT
Ehatv

Ehatv

Next Story