జమ్మూ(Jammu) డివిజన్‌లోని రాజౌరి(Rajari) జిల్లా కంది ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు(Shootout) జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి ఆర్మీ(Army) ఒక ప్రకటన విడుదల చేసింది.
జమ్మూ(Jammu) డివిజన్‌లోని రాజౌరి(Rajari) జిల్లా కంది ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు(Shootout) జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి ఆర్మీ(Army) ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్‌కౌంటర్‌లో(Encounter) ఐదురుగు జవాన్లు వీరమరణం పొందారని ప్రకటనలో పేర్కొంది. కాల్పుల ఘటనలో ఒక అధికారి సహా పలువురు సైనికులు గాయపడగా.. వారిని ఉధంపూర్ కమాండ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు జవాన్లు చికిత్స పొందుతూ మృతి చెందారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ప్రస్తుతానికి రాజౌరి జిల్లా కేంద్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
రాజౌరి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిర్దిష్ట సమాచారంతో పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ బృందాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని.. అనుమానాస్పద ప్రదేశానికి చేరుకున్న వెంటనే దాక్కున్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారని ఒక అధికారి తెలిపారు. ఆ సమయంలోనే ఉగ్రవాదులు పేలుడు పదార్థాన్ని పేల్చారు.. అందులో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందగా, ఒక అధికారి సహా నలుగురు గాయపడ్డారని తెలిపారు. ఎన్‌కౌంటర్ ప్రదేశానికి సమీప ప్రాంతాల నుంచి అదనపు బృందాలను రప్పించామని.. ఎన్‌కౌంటర్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారి తెలిపారు.