జమ్మూకశ్మీర్‌లో(Jammu Kashmir) ఉదయం భారీ ఎన్‌కౌంటర్(encounter) జరిగింది. కుప్వారాలోని(Kupwara) నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదులు(terrorist), భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు(Shoot out) జరిగాయి. ఇందులో అయిదుగురు విదేశీ ఉగ్రవాదులను మన జవాన్లు(Army) హతమార్చారు.

Jammu Kashmir Shoot Out
జమ్మూకశ్మీర్‌లో(Jammu Kashmir) ఉదయం భారీ ఎన్‌కౌంటర్(encounter) జరిగింది. కుప్వారాలోని(Kupwara) నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదులు(terrorist), భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు(Shoot out) జరిగాయి. ఇందులో అయిదుగురు విదేశీ ఉగ్రవాదులను మన జవాన్లు(Army) హతమార్చారు. ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందుకున్న సైన్యం, పోలీసులు గురువారం రాత్రి నుంచే సంయుక్త ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని కశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్‌కుమార్ తెలిపారు. ఇందులో అయిదుగురు ఉగ్రవాదులు చనిపోయారని, మిగతా ఉగ్రవాదుల కోసం వెతుకుతున్నామని చెప్పారు.
