జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రాంతాలలో గత 24 గంటల్లో ఐదు తేలికపాటి-తీవ్రతతో కూడిన భూకంపాలు సంభవించాయి. శనివారం మధ్యాహ్నం 2.03 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లో 3.0 తీవ్రతతో మొదట ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం.. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి కొండ రాంబన్ జిల్లాలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.

5 Earthquakes, Two Within 15 Minutes, Hit J&K and Ladakh Region in 24 Hours
జమ్మూ(Jammu), కశ్మీర్(Kashmir), లడఖ్(Ladakh) ప్రాంతాలలో గత 24 గంటల్లో ఐదు తేలికపాటి-తీవ్రతతో కూడిన భూకంపాలు సంభవించాయి. శనివారం మధ్యాహ్నం 2.03 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లో 3.0 తీవ్రతతో మొదట ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం.. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి రాంబన్ జిల్లా(Ramban District)లో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ( National Center for Seismology) పేర్కొంది. భూకంపం(Earthquake) లోతు ఉపరితలం నుండి ఐదు కిలోమీటర్ల దిగువన ఉందని వెల్లడించింది.
రెండో భూకంపం రాత్రి 9.44 గంటలకు 4.5 తీవ్రతతో లేహ్(Leh) ప్రాంతంలో సంభవించింది. భూకంప కేంద్రం లద్దాఖ్‌కు ఈశాన్యంగా 271 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. అనంతరం 15 నిమిషాల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా(Doda district)లో రాత్రి 9.55 గంటలకు 4.4 తీవ్రతతో భూమి కంపించింది. అయితే.. గడిచిన ఐదు రోజుల్లో దోడా జిల్లాలో ఇది ఏడో భూకంపం.
అనంతరం ఆదివారం తెల్లవారుజామున లడఖ్‌లోని లేహ్ జిల్లాకు ఈశాన్యంగా 295 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్-చైనా(India-China) సరిహద్దు ప్రాంతంలో 4.1 తీవ్రతతో మళ్లీ భూమి కంపించింది. ఆపై జమ్మూ కాశ్మీర్‌లోని కత్రా(Katra) సమీపంలో ఐదవ, చివరి భూకంపం సంభవించింది. కత్రాకు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 3.50 గంటలకు 11 కిలోమీటర్ల లోతులో 4.1 తీవ్రతతో భూమి కంపించింది.
