ఉత్తరాదిలో భూమి కంపించింది. ఢిల్లీతో(Delhi) పాటు ఉత్తర భారతంలోని(North India) పలు ప్రాంతాలలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత సంభవించిన భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది.
ఉత్తరాదిలో భూమి కంపించింది. ఢిల్లీతో(Delhi) పాటు ఉత్తర భారతంలోని(North India) పలు ప్రాంతాలలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత సంభవించిన భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. ఢిల్లీ, చండీగఢ్(Chandigarh), పంజాబ్‌లలో(Punjab) ప్రకంపనలు వచ్చాయి. జమ్ము కశ్మీర్‌లోని(Jammu Kashmir) శ్రీనగర్‌లో(Sri Nagar) భూమి బలంగా కంపించింది. దోడా జిల్లాలోని గండోహ్ భలెస్సా గ్రామ సమీపంలో 5.7 మాగ్నిట్యూడ్ నమోదయ్యింది. మణిపూర్‌లో(Manipur) భూమి స్వల్పంగా కంపించగా, పాకిస్థాన్లోని లాహోర్‌లోనూ భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. భూకంపం దాటికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.