బీహార్(Bihar)లో జరుగుతోన్న రెండో దశ కుల గణన(caste-based census)లో చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. అవి చూసి అధికారులు బిత్తరపోతున్నారు. కుల గణనలో భాగంగా కులం, విద్య, ఆర్ధిక స్థితి, కుటుంబ నేపథ్యం .. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునేందుకు అధికారులు ఇళ్లల్లో తిరుగుతున్నారు. మొన్న అర్వాల్ జిల్లా(Arwal District)లోని ఓ రెడ్‌లైట్ ఏరియా(Redlight Area)లో కులగణన కోసం ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లారు.
బీహార్(Bihar)లో జరుగుతోన్న రెండో దశ కుల గణన(caste-based census)లో చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. అవి చూసి అధికారులు బిత్తరపోతున్నారు. కుల గణనలో భాగంగా కులం, విద్య, ఆర్ధిక స్థితి, కుటుంబ నేపథ్యం .. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునేందుకు అధికారులు ఇళ్లల్లో తిరుగుతున్నారు. మొన్న అర్వాల్ జిల్లా(Arwal District)లోని ఓ రెడ్‌లైట్ ఏరియా(Redlight Area)లో కులగణన కోసం ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లారు. అక్కడ ఉన్న దాదాపు 40 మంది మహిళలు తమ భర్త పేరు రూప్‌చంద్ అని చెప్పడం విశేషం. పిల్లలను అడిగినా తమ తండ్రి పేరు రూప్‌చంద్ అని చెప్పారట. అధికారులకేమీ అంతుపట్టలేదు. ఇందులోని మర్మమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు కానీ అసలు విషయం తెలియలేదు. ఆ రెడ్‌లైట్ ఏరియాలో చాన్నాళ్లుగా రూప్‌చంద్ అనే డాన్సర్ ఉంటున్నాడట. డాన్స్‌లు చేస్తూ, పాటలు పాడుతూ పొట్ట గడుపుకుంటున్నాడట.! అన్నేళ్ల నుంచి అక్కడ ఉంటున్నా సొంత ఇల్లు అంటూ లేదట. అయినప్పటికీ అతడంటే అక్కడున్నవారికి బోల్డంత అభిమానం అట! ఆ అభిమానంతోనే మహిళలందరూ గంపగుత్తగా తమ భర్త పేరును రూప్‌చంద్‌గా చెప్పుకున్నారట! కొసమెరుపు ఏమిటంటే అక్కడ ఉన్నవారికి కులం అంటూ ఏదీ లేదట! ఇది బాగుంది కదూ!