ఉత్తరాఖండ్‌లో(Uttarakhand) హింస(Voilence) చెలరేగింది. నలుగురు మృత్యువాతపడ్డారు. 250 మందికి గాయాలయ్యాయి. మదర్సా కూల్చివేత ఈ హింసకు కారణమయ్యింది. హల్ద్వాని సిటీలో(Haldwani) గురువారం రోజున ఈ ఘటన చోటు చేసుకుంది.

ఉత్తరాఖండ్‌లో(Uttarakhand) హింస(Voilence) చెలరేగింది. నలుగురు మృత్యువాతపడ్డారు. 250 మందికి గాయాలయ్యాయి. మదర్సా కూల్చివేత ఈ హింసకు కారణమయ్యింది. హల్ద్వాని సిటీలో(Haldwani) గురువారం రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. అల్లర్లను నియంత్రించడానికి నగరంలో కర్ఫ్యూ(Curfew) విధించాల్సి వచ్చింది. పరిస్థితి అదుపుతప్పడంతో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు(Shoot at sight) జారీ చేశారు పోలీసులు. ఇంటర్నెట్‌ సేవలను రద్దు చేశారు. స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. కోర్టు ఆదేశాల ప్ర‌కారం మదర్సాను(Madarsa) కూల్చివేయడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధమయ్యారు. భారీ పోలీసులు బందోబస్తుతో ఆ ప్రాంతానికి వెళ్లారు. మదర్సా, మసీదు అక్రమ స్థలంలో ఉన్నట్టు అధికారులు పేర్కొంటూ బుల్డోజర్‌తో కూల్చివేతకు దిగారు. దాంతో హ‌ల్ద్వానిలోని వ‌న్‌బుల్‌పురా ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక్క‌సారిగా ఎదురుతిరిగారు. ఫలితంగా అక్క‌డ హింస చోటుచేసుకున్న‌ది. గాయపడినవారిలో ప్రభుత్వ అధికారులు, మున్సిపల్‌ శాఖకు చెందిన ఉద్యోగులు, జర్నలిస్టులు ఉన్నారు. ఆందోళనకారులు రాళ్లు విసరడంతో పోలీసులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు. పోలీసు స్టేష‌న్ వ‌ద్ద ఉన్న వాహ‌నాల‌కు ఆందోళ‌న‌కారులు నిప్పుపెట్టారు. దీంతో శాంతి భ‌ద్ర‌త‌లు మ‌రింత క్షీణించాయి. సంఘ విద్రోహశక్తులే అక్కడ హింసకు దిగారని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి అన్నారు. గ‌తంలోనే మ‌సీదు, మ‌ద‌ర‌సా ఉన్న ప్రాంతంలోని మూడు ఎక‌రాల‌ను సీజ్ చేశామ‌ని మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ పంక‌జ్ ఉపాధ్యాయ తెలిపారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా న‌గ‌రంలో క‌ర్ఫ్యూ విధించిన‌ట్లు అధికారులు చెప్పారు.

Updated On 9 Feb 2024 4:16 AM GMT
Ehatv

Ehatv

Next Story