✕
తమిళనాడులోని తంజావూరు జిల్లాకు వెళితే ఓ పట్టాన వెనక్కి రాబుద్దేయదు! అక్కడ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బృహదీశ్వర దేవాలయమే కాదు ఇంకా అనేక అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. కుంభకోణంలోని కుంభేశ్వర దేవాలయంతో పాటు ఆ గుడికి సమీపంలోనే దారాసురం అనే గొప్ప ఆలయం ఒకటుంది.

x
Shri Airavatesvara Temple
-
- తమిళనాడులోని(Tamilnadu) తంజావూరు(Thanjauru) జిల్లాకు వెళితే ఓ పట్టాన వెనక్కి రాబుద్దేయదు! అక్కడ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బృహదీశ్వర దేవాలయమే(Bruhadiswara Temple) కాదు ఇంకా అనేక అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. కుంభకోణంలోని కుంభేశ్వర(Kumbeswara Temple) దేవాలయంతో పాటు ఆ గుడికి సమీపంలోనే దారాసురం(Dasarasuram) అనే గొప్ప ఆలయం ఒకటుంది. పరమేశ్వరుడు వెలసిన మహాక్షేత్రమిది! ఇక్కడ పరమశివుడు ఐరావతేశ్వర స్వామిగా భక్తులను ఆశీర్వదిస్తున్నాడు.
-
- అమ్మవారు దేవ నాయకిగా కొలువు దీరారు. దేవతల ఏనుగైన ఐరావతం ఆ మహాశివుడిని(Lord Shiva) ఇక్కడే కొలిచింది. పూజలు చేసింది. ఆ ఐరావతం భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ఐరావతేశ్వర స్వామిగా(Airavatheswara Swamy) పూజలందుకుంటున్నాడు. శ్రీకాళహిస్తిలో కూడా సాలీడు, ఏనుగు, సర్పాలను తనలో ఐక్యం చేసుకున్నాడుగా ఆ భోళా శంకరుడు. ఇక్కడ ఐరావతం కోసం ఐరావతేశ్వర స్వామిగా వెలిశాడు. దారాసురానికి మరో విశిష్టత కూడా ఉంది.
-
- నరకలోకాధిపతి యముడు ఓసారి రుషి శాపానికి గురవుతాడు. శరీరం మొత్తం మండిపోతుంటుంది. శాప విముక్తి కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటాడు. అందులో భాగంగానే దారాసురం వస్తాడు. ఇక్కడి పుష్కరిణిలో స్నానమాచరిస్తాడు. అంతే..! ఆ బాధ నుంచి ఆయనకు విముక్తి లభిస్తుంది. అప్పట్నుంచి ఈ కోనేటికి యమతీర్థమని(Yamathirdham) పేరు వచ్చింది. రాజరాజ చోళుడు(King Chola) ఈ ఆలయాన్ని నిర్మించాడు.
-
- యునెస్కో గుర్తించిన వారసత్వ కట్టడాల జాబితాలో ఈ ఆలయం కూడా ఉంది. తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురాలతోపాటు ఈ ఆలయానికి కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ఆలయాన్ని ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. ముఖమండపాన్ని రథం రీతిలో అశ్వాలు లాగుతున్నట్టుగా తీర్చిదిద్దారు.
-
- పైకప్పులో ఉన్న శిల్పకళను మంత్ర ముగ్ధులను చేస్తుది. ఇక్కడ అనేక శిల్పాలు త్రీడీ రూపంలోనూ ఉండటం చెప్పుకోదగ్గ విశేషం. ఇప్పుడు వాడుతున్న ఆధునిక టెక్నాలజీ వెయ్యేళ్ల క్రితం చెక్కిన శిల్పాలలో కనిపించడం విశేషం. ఇక్కడి శిల్పాలను చూస్తే సజీవమూర్తులుగా కనిపిస్తాయి! ఆలయ ప్రధాన ద్వారం దగ్గర చిన్న మండపం ఉంది. అక్కడి మెట్లను తాకితే సప్త స్వరాలు వినపిస్తాయి.
-
- లోపల లంకాధీశుడు రావణాసుడు కైలాసాన్ని ఎత్తేందుకు ప్రయత్నిస్తున్న శిల్పం గొప్పగా ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో సప్త మాతృకల ఆలయం, దేవి ఆలయం తదితర ఆలయాలు ఉన్నాయి. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన శ్రీరంగం స్థాయిలో ఈ దేవాలయం ఉండేదట! శాసనాలు ఆ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఐరావతేశ్వర ఆలయ ప్రాంగణం మాత్రమే ఉంది.

Ehatv
Next Story