ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అంతరించాయి. న్యూక్లియర్ ఫ్యామిలీసే అన్నీ! భార్యాభర్తలు, మహాఅయితే ఇద్దరు పిల్లలు. ఇదే కుటుంబం! కొందరు తల్లిదండ్రులను కూడా తమతోనే ఉంచుకుంటారు. అంటే ఓ ఇంట్లో నలుగురైదుగురు ఓటర్లు ఉంటారు. కొన్ని కుటుంబాల్లో డజన్ మంది ఓటర్లు ఉన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. 40 నుంచి 50 ఓటర్లు ఉండటం అన్నది చాలా చాలా అరుదు.
ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అంతరించాయి. న్యూక్లియర్ ఫ్యామిలీసే అన్నీ! భార్యాభర్తలు, మహాఅయితే ఇద్దరు పిల్లలు. ఇదే కుటుంబం! కొందరు తల్లిదండ్రులను కూడా తమతోనే ఉంచుకుంటారు. అంటే ఓ ఇంట్లో నలుగురైదుగురు ఓటర్లు ఉంటారు. కొన్ని కుటుంబాల్లో డజన్ మంది ఓటర్లు ఉన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. 40 నుంచి 50 ఓటర్లు ఉండటం అన్నది చాలా చాలా అరుదు. కానీ అస్సాం(Assam)లోని ఓ కుటుంబంలో ఏకంగా 350 మంది ఓటర్లు ఉన్నారు. సోనిట్‌పూర్ జిల్లాలోని ఫులోగురి నేపాలీ పామ్ గ్రామంలో ఉందీ కుటుంబం! ఇంత పెద్ద కుటుంబమా అని ఆశ్చర్యపడకండి. ఆ గ్రామంలో రోన్ బహదూర్ తాపా అనే వ్యక్తి ఉండేవారు. ఆయనకు అయిదుగురు భార్యలు. ఈ పంచ సతీమణుల ద్వారా ఆయనకు 12 మంది కొడుకులు కలిగారు. తొమ్మిది మంది కూతుళ్లు కూడా పుట్టారు.
ఆ పన్నెండు మంది కొడుకులకు 56 మంది సంతానం. అలాగే తొమ్మిది మంది కూతుళ్లకు 50 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ల పిల్లలు, వాళ్ల పిల్లల పిల్లలు కలిపి మొత్తం రోన్ బహదూర్ తాపా కుటుంబసభ్యుల సంఖ్య 12 వందలు దాటింది. ఇందులో ఓటు హక్కు ఉన్నవారు 350 మంది! ఈ నెల 19వ తేదీన జరగబోయే లోక్‌సభ మొదటి విడత ఎన్నికల పోలింగ్‌లో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అత్యధిక మంది ఓటర్లు ఉన్న అతి కొద్ది కుటుంబాలలో రోన్ తాపా కుటుంబం కూడా ఒకటిగా నిలిచింది.