కాంగ్రెస్(Congress) రాజ్యసభ సభ్యుడు(Rajya sabha) ధీరజ్ సాహు(Dheeraj Sahu) అక్రమ సంపాదనపై(Blak money) ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. దోచేందుకు కాదేదీ అనర్హం అన్నట్టు మంది సొమ్ము అప్పనంగా దోచేశాడు. దాచేందుకు కాదేదీ అనర్హం అంటూ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బు దాచాడు. ఆ డబ్బును లెక్కించడానికి మెషిన్లు కూడా మొరాయిస్తున్నాయట. ఇంట్లో ఏ మూలన వెతికినా సంచులు బయటపడుతూనే ఉన్నాయి.
కాంగ్రెస్(Congress) రాజ్యసభ సభ్యుడు(Rajya sabha) ధీరజ్ సాహు(Dheeraj Sahu) అక్రమ సంపాదనపై(Blak money) ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. దోచేందుకు కాదేదీ అనర్హం అన్నట్టు మంది సొమ్ము అప్పనంగా దోచేశాడు. దాచేందుకు కాదేదీ అనర్హం అంటూ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బు దాచాడు. ఆ డబ్బును లెక్కించడానికి మెషిన్లు కూడా మొరాయిస్తున్నాయట. ఇంట్లో ఏ మూలన వెతికినా సంచులు బయటపడుతూనే ఉన్నాయి. 'అతడు' సినిమాలో కోట శ్రీనివాస్‌రావు డైలాగ్ 'లెక్కెట్టేందుకే వారం పట్టుద్ది' అన్నట్లు... ఇక్కడ లెక్కెట్టడానికి నెల రోజులు పట్టేలా ఉంది. దాదాపు 200 సంచుల్లో దాచి ఉంచిన సొమ్ములో అధికారులు ఇప్పటివరకు 140 సంచులు లెక్కించారు. దాదాపు 40 మెషిన్లతో డబ్బును లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన మొత్తం రూ.351 కోట్లని తేల్చారు. పలు బ్యాంకులకు(Bank) చెందిన 50 మంది అధికారులు ఈ లెక్కింపులో పాల్గొంటున్నారు. మిగిలిన సంచులు లెక్కిస్తే కానీ పూర్తి సంపాదన రాదని అధికారులు చెప్తున్నారు. డబ్బు లెక్కించడానికి సిబ్బంది సరిపోవడంలేదని మరికొంత మంది సిబ్బంది కావాలని ఐటీ అధికారులను కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంపై శివసేన(shivasena) ఎంపీ ప్రియాంక చతుర్వేది(MP Priyaka Chathurvedi) సెటైర్లు విసిరారు. ధీరజ్ సాహు బీజేపీలో చేరితే క్లీన్ చిట్ దొరుకుతుందని చెప్పారు. అజిత్‌పవార్ ఎన్సీపీని చిల్చిన తర్వాత ఆయన ఇంట్లో ఈడీ, ఐటీ చర్యలు ఆగిపోయాయని.. ఎంతో మంది అవినీతి పరులు బీజేపీలో చేరి పాప పునీతులయ్యారని.. ధీరజ్ సాహు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చెయాలని ఆమె వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది.