అసెంబ్లీ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (మహిళల నియామకం కోసం ప్రత్యేక నిబంధనలు) రూల్స్ 1997ను సవరించినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది.
అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)కు ముందు మధ్యప్రదేశ్ ప్రభుత్వం(Madhya Pradesh Govt) మహిళలకు అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (మహిళల నియామకం కోసం ప్రత్యేక నిబంధనలు) రూల్స్ 1997ను సవరించినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్(Notification)లో పేర్కొంది. ఇందులో అటవీ శాఖ మినహా ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు.
నోటిఫికేషన్ ప్రకారం.. “స్టేట్ అండర్ సర్వీస్‌లోని (అటవీ శాఖ మినహా) అన్ని పోస్టులలో 35 శాతం మహిళలకు రిజర్వ్ చేయబడుతుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ దశలో మహిళలకు అనుకూలంగా రిజర్వేషన్లు.. క్షితిజ సమాంతరంగా, కంపార్ట్‌మెంట్ వారీగా అందించబడతాయని పేర్కొన్నారు.
రాష్ట్ర పోలీసు(Police), ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం, టీచింగ్ పోస్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. దీంతోపాటు స్థానిక సంస్థల్లో ఆల్డర్‌మెన్‌తోపాటు ఇతర స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదే సమయంలో బాలికలకు మెరుగైన విద్యనందించేందుకు ఫీజులను ప్రభుత్వమే భరిస్తుంది.
ఇటీవల కేంద్రంలోని మోదీ(Modhi) ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు(Woman Reservation Bill)ను పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారింది. 'నారీ శక్తి వందన్ చట్టం' పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంది.