ఓ సాఫ్ట్‌వేర్‌(Software) ఇంజినీర్‌కు వస్తున్న ఆదాయం(Income) సరిపోలేదు. ఆన్‌లైన్‌లో పార్ట్‌ టైం జాబ్‌(Part time Job) కోసమని వెతికాడు. సైబర్‌నేరగాళ్లకు(Cyber Criminals) చిక్కాడు. తన ఖాతాలో ఉన్న 17 లక్షలు పోగొట్టుకోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ప్రతిరోజు సైబర్‌ నేరగాళ్లకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నా టెకీలకు(techies) మాత్రం అర్థం కావడం లేదు. మంది మాట నమ్ముకుని మారు మనువు పోతే మళ్లీ వచ్చేసరికి ఇల్లు గుల్ల అయిందన్న సామెత ఈ ఉదంతానికి నిదర్శనం. పుణెలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పుణెలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న 34 ఏళ్ల ఓ వ్యక్తి అదనపు ఆదాయం కోసం ఆరాటపడ్డాడు. ఆన్‌లైన్‌లో పార్ట్‌ టైం జాబ్ కోసం అన్వేషించాడు. పార్ట్‌టైం జాబ్‌ అంటూ సోషల్‌ మీడియాలో(Social Media) ఓ ప్రకటన రావడంతో అది టెకీ కంటపడింది. సైబర్ నేరగాళ్లు పంపిన వీడియోలు క్లిక్‌ చేయడం ప్రారంభించాడు. డిసెంబర్ 1నుంచి డిసెంబర్ 6 మధ్య సైబర్‌ కేటుగాళ్లు పంపించిన టాస్క్‌లను పూర్తి చేశాడు. మరోవైపు ఆ కేటుగాళ్లు బ్యాకెండ్‌లో వారిపని పూర్తి చేసుకున్నారు. తన ఖాతాలో ఉన్న రూ.17 లక్షలు పోయాయని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి సొమ్మును జైపూర్, కొచ్చిలోని ప్రాంతాలే కాకుండా విదేశాలకు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Updated On 22 Dec 2023 6:44 AM GMT
Ehatv

Ehatv

Next Story