కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మృతిని తట్టుకోలేని ఓ యజమాని రాజశేఖర్ (33) ఆత్మహత్యకు పాల్పడ్డాడు పాల్పడ్డాడు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మృతిని తట్టుకోలేని ఓ యజమాని రాజశేఖర్ (33) ఆత్మహత్యకు పాల్పడ్డాడు పాల్పడ్డాడు. బెంగళూరులోని హెగ్గడదేవనపురలో నివాసం ఉండే రాజశేఖర్ తొమ్మిదేళ్లుగా జర్మన్ షెపర్డ్(German Shepherd) జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. దానిని బౌన్సీ అనే పేరుతో పిల్చుకునేవాడు. అయితే, ఆ శునకం అనారోగ్యంతో మంగళవారం నాడు చనిపోయింది. దాంతో అదే రోజు తన వ్యవసాయ క్షేత్రంలో దాని అంత్యక్రియలు నిర్వహించాడు. ప్రాణంగా చూసుకున్న బౌన్సీని కోల్పోవడం రాజశేఖర్(Rajashekar)ను మనోవేదనకు గురిచేసింది. దాని మృతిని తట్టుకోలేక దానిని కట్టేసే చైన్‌తోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం తన ఇంట్లో శవమై కనిపించాడు. ఈ ఘటనపై మదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.