ఓ పనిమనిషి నాలుగైదు ఇళ్లలో పనిచేస్తుంది. ఆమెకు రానురాను సోషల్‌ మీడియా పిచ్చి పట్టుకుంది.

ఓ పనిమనిషి నాలుగైదు ఇళ్లలో పనిచేస్తుంది. ఆమెకు రానురాను సోషల్‌ మీడియా పిచ్చి పట్టుకుంది. తక్కు సమయంలో బాగా పాపులర్(Popular) కావాలని ఆశించింది. ఇందుకోసం మంచి కెమెరా(camera) కొనాలని నిశ్చయించుకుంది. అయితే కెమెరా(Camera) కొనేంత డబ్బులు లేకపోవడంతో ఆమెకు దుర్బుద్ధి పుట్టింది. ఇంకేముంది పనిచేసే ఇంటికే కన్నం పెట్టింది.

ఢిల్లీలోని(Delhi) ఓ ఇంట్లో పనిచేసే 30 ఏళ్ల నీతూయాదవ్‌ సోషల్‌ మీడియా పిచ్చి పట్టుకుంది. ఈ క్రమంలోనే యూట్యూబ్ చానెల్‌ పెట్టి ఫేమస్‌ కావాలనుకుంది. ఇందుకోసం తనకు ఓ మంచి కెమెరా కావాలని, అందుకయ్యే డబ్బు తన దగ్గర లేకపోవడంతో పనిచేసి ఇంట్లో లక్షల విలువైన నగలు కాజేసి పరారైంది. రాజస్తాన్‌ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడింది. నీతూయాదవ్ భర్త డ్రగ్స్‌కు(drugs) బానిస కావడంతో ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం కొనసాగించేది. మెల్లమెల్లగా తను కూడా రీల్స్‌(reels) పిచ్చి పట్టి పాపులర్ కావాలనుకుంది. యూట్యూబ్‌(Youtube) పెట్టి సంపాదించాలనుకొని అందుకయ్యే ఖర్చుకోసం పనిచేసి ఇంటి నుంచి బంగారం, వెండి సహా విలువైన వస్తువులను తీసుకొని పరారైంది. నీతూయాదవ్‌పై యజమాని ఫిర్యాదు చేయడంతో ఆమెను పోలీసులు వెంబడించారు. నగల బ్యాగుతో పారిపోతున్న ఆమెను పట్టుకొని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Eha Tv

Eha Tv

Next Story