అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని అవగాహనా కార్యక్రమాలను నిర్వహించినా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో(Devaragattu Bunny Utsavam) మాత్రం హింస ఆగడం లేదు. ప్రతి సంవత్సరం విజయదశమి రాత్రి దేవరగట్టులో కర్రల యుద్ధం జరుగుతుందన్న విషయం తెలిసిందే! ఈసారి ఆ ఉత్సవాలలో విషాదం చోటు చేసుకుంది. కర్రల యుద్ధంలో ముగ్గురు చనిపోయారు. 60 మందికిపైగా గాయపడ్డారు. అయితే చనిపోయింది కర్రల పోరులో కాదు.

అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని అవగాహనా కార్యక్రమాలను నిర్వహించినా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో(Devaragattu Bunny Utsavam) మాత్రం హింస ఆగడం లేదు. ప్రతి సంవత్సరం విజయదశమి రాత్రి దేవరగట్టులో కర్రల యుద్ధం జరుగుతుందన్న విషయం తెలిసిందే! ఈసారి ఆ ఉత్సవాలలో విషాదం చోటు చేసుకుంది. కర్రల యుద్ధంలో ముగ్గురు చనిపోయారు. 60 మందికిపైగా గాయపడ్డారు. అయితే చనిపోయింది కర్రల పోరులో కాదు. కర్రల సమరాన్ని చూడటానికి స్థానికులు కొందరు చెట్టు ఎక్కారు. ఆ చెట్టు కొమ్మ కాస్తా బరువు ఆపలేక విరిగిపడింది. దాంతో ఇద్దరు అక్కడిక్కడే చనిపోయాడు. గాయాలబారిన పడినవారికి హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. మరొకరు తోపులాటలో చనిపోయారు. కర్రలు, ఇనుప రింగుల కర్రలతో జనం కొట్టుకున్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ బన్ని ఉత్సవాన్ని మంగళవారం అర్ధరాత్రి కొనసాగించారు. ఈ నేపథ్యంలో దేవరగట్టులో మరోసారి సంప్రదాయమే గెలిచింది. ఆచారం పేరిట యథావిధి ఈ భక్తి పోరాటం కొనసాగింది.
ఈ కర్రల సమరం ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు కానీ మాలమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. ఆ విశ్వాసమే వారిని కర్రలతో కొట్టుకునేలా చేస్తోంది. ఈ పోరులో అనేక మందికి గాయాలయ్యి, తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కొకొల్లలుగా ఉన్నాయి. అయినప్పటికీ గ్రామస్తులు వెనుకడుగు వేయడం లేదు. ఆచార సంప్రదాయాలను ఇలాగే కొనసాగిస్తామనే పట్టుదలతో ఉన్నారు. ప్రతి ఏడాది జరిగే ఈ కర్రల యుద్ధంలో సుమారు రెండు లక్షల మందికిపైగా పాల్గొంటారు.

Updated On 25 Oct 2023 1:30 AM GMT
Ehatv

Ehatv

Next Story