ప్రధానమంత్రి నరేంద్రమోదీ (narendra modi)కి వ్యతిరేకంగా పోస్టర్లు వేస్తున్నారా? అయితే జాగ్రత్త! పోలీసులు బొక్కలో వేస్తారు. గుజరాత్‌(gujarath) లో ఇదే జరిగింది. అహ్మదాబాద్‌(ahmedabad)లో పలు చోట్ల మోదీ హఠావో, దేశ్‌ బచావో (modi hatao,desh bachao) అనే వ్యాఖ్యలతో ఉన్న పోస్టర్లు వెలిశాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (narendra modi)కి వ్యతిరేకంగా పోస్టర్లు వేస్తున్నారా? అయితే జాగ్రత్త! పోలీసులు బొక్కలో వేస్తారు. గుజరాత్‌(gujarath) లో ఇదే జరిగింది. అహ్మదాబాద్‌(ahmedabad)లో పలు చోట్ల మోదీ హఠావో, దేశ్‌ బచావో (modi hatao,desh bachao) అనే వ్యాఖ్యలతో ఉన్న పోస్టర్లు వెలిశాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (aam aadmi party) ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోస్టర్ల ప్రచారాన్ని చేపట్టింది. మరుసటి రోజే అరెస్టులు జరగడం గమనార్హం. మోదీ హఠావో, దేశ్‌ బచావో పేరుతో ఆమ్‌ ఆద్మీ పార్టీ గుజరాతీ, పంజాబీ, తెలుగు, ఒడియా, కన్నడ, మలయాళం, మరాఠీ..ఇలా మొత్తం 11 భాషలలో పోస్టర్ల ప్రచారం మొదలు పెట్టింది. లాస్ట్‌ వీక్‌ ఢిల్లీలో కూడా మోదీ వ్యతిరేక పోస్టర్లు కనిపించాయి. దీనిపై 49 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. పోలీసులు ఆరుగురుని అదుపులో తీసుకున్నారు. ప్రింటింగ్‌ ప్రెస్‌లకు చెందిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్‌ చేశారు. పబ్లిక్ ప్రాపర్టీలను పాడు చేయడం, పోస్టర్లపై ప్రింటింగ్‌ ప్రెస్‌(printingpress)కు సంబంధించిన పేరు, అడ్రస్‌, ఇతర వివరాలు లేకపోవడం వల్లే చట్టప్రకారం వారిని అరెస్ట్‌ చేశామని పోలీసులు అంటున్నారు. ఇందులో రాజకీయపరమైన ఒత్తిళ్లు లేవని చెబుతున్నారు. బ్రిటిష్‌ కాలంలో ఇలాంటి నిరసనలు ఎన్నో తెలిపారని, తెల్లదొరలు స్వాతంత్ర ఉద్యమకారులను ఎలాంటి కేసులు పెట్టలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నారు.

అరెస్ట్‌లపై స్పందించిన కేజ్రీవాల్‌ ఆనాడు భగత్‌సింగ్‌ స్వయంగా బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించాడు. అయినా ఏనాడూ భగత్‌సింగ్‌పై ఒక్క ఎఫ్‌ఐఆర్‌ (FIR)కూడా నమోదు కాలేదన్నారు. కానీ ఇప్పుడు ప్రధానిపై పోస్టర్లు వేశారని 138 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని తెలిపారు. 'రాత్రికి రాత్రే అమాయకులను అరెస్ట్‌ చేశారు. దేశంలో అసలు ఏం జరుగుతోంది. మోదీ ఆరోగ్యంగానే ఉన్నారా? మోదీ హఠావో. దేశ్‌ బచావో అనే పోస్టర్ల క్యాంపెయిన్‌ అసలు పెద్ద అంశమేనా? ప్రధాని ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అభద్రతాభావంలో కూరుకుపోతున్నారు? బహుశా నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదేమో! ఓ మంచి డాక్టర్‌కు చూపించుకుంటే మంచిది. ప్రధాని ఆరోగ్యం బాగుండాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా' అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Updated On 31 March 2023 4:19 AM GMT
Ehatv

Ehatv

Next Story