సివిల్స్‌ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్న ముగ్గురు విద్యార్థులు నీట మునిగి చనిపోయిన విషయం తెలిసిందే.

దేశ రాజధాని ఢిల్లీలోని(Delhi) ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని(Old Rajendra Nagar) రావ్ స్టడీ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి వర్షపు నీరు వదరలా చేరడంతో సివిల్స్‌ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్న ముగ్గురు విద్యార్థులు నీట మునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీడియోలో ప్రమాదానికి ముందు బేస్‌మెంట్‌లోకి నీరు ఎలా వేగంగా చేరుతున్నదో స్పష్టంగా చూడొచ్చు. లోపలున్న విద్యార్థులు త్వరగా బయటకు రావాలని కోచింగ్ సెంటర్‌ సిబ్బంది చెప్పడం కూడా వినిపిస్తుంది. అలాగే లోపల ఎవరైనా ఉన్నారా? అని అడగడం కూడా మనకు కనిపించింది. కేవలం అయిదు నిమిషాల్లో సెల్లార్‌ మొత్తం వరద నీటితో నిండిపోయిందని ప్రత్యక్ష సాక్షుల అంటున్నారు. శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కోచింగ్‌ సెంటర్‌లపై ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ చర్యలు మొదలు పెట్టింది. చట్టవిరుద్ధంగా నడుస్తున్న పలు కోచింగ్ సెంటర్లను సీల్ చేయడానికి సిద్ధమవుతోంది. అలాగే ఈ విషాద ఘటనపై దర్యాప్తు చేయడానికి త్వరలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఒక అధికారి తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story