ఆధార్(Aadhar Card)... ఇప్పుడు ప్రతి పౌరునికి ముఖ్యమైన కార్డ్. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశ పౌరుడిగా గుర్తించబడేందుకు ఉన్న ఏకైక పత్రం అని చెప్పొచ్చు. మనకు ఆధార్ నంబర్‌ను జారీ చేసిన సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అన్ని రకాల ప్రభుత్వ, ఇతర సేవలలో ఉపయోగించే ఆధార్ కార్డ్‌లో అవసరమైన మార్పులకు సంబంధించి ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తోంది.

ఆధార్(Aadhar Card)... ఇప్పుడు ప్రతి పౌరునికి ముఖ్యమైన కార్డ్. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశ పౌరుడిగా గుర్తించబడేందుకు ఉన్న ఏకైక పత్రం అని చెప్పొచ్చు. మనకు ఆధార్ నంబర్‌ను జారీ చేసిన సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అన్ని రకాల ప్రభుత్వ, ఇతర సేవలలో ఉపయోగించే ఆధార్ కార్డ్‌లో అవసరమైన మార్పులకు సంబంధించి ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తోంది. వాస్తవానికి UIDAI పౌరులు తమ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి అనుమతులు జారీ చేసింది. సాధారణంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి రూ.50 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. UIDAI ఎప్పటికప్పుడు ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాలని సూచిస్తుంది. మీ ఆధార్ కార్డ్‌లో ఏదైనా సమాచారం తప్పుగా నమోదు చేయబడి, దాన్ని సరిదిద్దాలనుకుంటే వెంటనే ఆధార్ అప్డేట్ చేయండి. ఇప్పుడు ఈ పనిని ఉచితంగా పూర్తి చేయడానికి ఇదే సరైన సమయం. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని UIDAI కొంత కాలం పాటు ఆధార్ కార్డులో అప్‌డేట్‌ను ఉచితంగా చేసింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

జూన్ 14 వరకు అప్డేట్ చేసుకోవచ్చు..
జూన్ 14, 2023 వరకు ఆధార్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయవచ్చు. ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డ్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ వివరాలను అప్‌డేట్ చేయాలని UIDAI విజ్ఞప్తి చేస్తోంది.

ఆన్‌లైన్‌లో ఆధార్‌ను ఇలా అప్‌డేట్ చేయండి..
1. ముందుగా ఆధార్ అధికారిక పోర్టల్‌కి https://ssup.uidai.gov.in/ssup/ లాగిన్ కావాలి.
2. ఆ తర్వాత 'లాగిన్'పై క్లిక్ చేసి 12 అంకెల ఆధార్ నంబర్, అక్కడున్న క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత 'Send OTP'పై క్లిక్ చేసి, మీ ఆధార్ కార్డుకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేయాలి.్
3. ఇప్పుడు సర్వీసెస్ ట్యాబ్ కింద 'ఆధార్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయి' అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
4. ఇప్పుడు 'ప్రొసీడ్ టు అప్‌డేట్ ఆధార్'పై క్లిక్ చేసి, మీరు మార్చాలనుకుంటున్న వివరాలను ఎంచుకోవాలి.
5. ఆధార్ కార్డ్‌లో ఇప్పటికే ఉన్న మీ పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ కార్డ్ డీటేయిల్స్ అప్‌లోడ్ చేయడం ద్వారా మీకు కావలసిన మార్పులు చేయవచ్చు.
6. చివరగా మీరు చేసిన మార్పులను అప్డేట్ చేయండి. అంతే మీ ఆధార్ అప్డేట్ అయినట్లే.

Updated On 12 Jun 2023 1:56 AM GMT
Ehatv

Ehatv

Next Story