కెనడా(Canada)లోని గ్రేటర్‌ టొరంటో(Greater Toronto) ప్రాంతంలోని మూడు సినిమా థియేటర్లలో కలకలం రేగింది. ఆ మూడు థియేటర్లలోనూ హిందీ సినిమా(Hindi Movies)లే ప్రదర్శితమవుతాయి. మాస్క్‌లు ధరించిన వ్యక్తులు థియేటర్లలోపలికి వచ్చి గుర్తు తెలియని కెమికల్‌ను స్ప్రే చేయడంతో ప్రేక్షకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

కెనడా(Canada)లోని గ్రేటర్‌ టొరంటో(Greater Toronto) ప్రాంతంలోని మూడు సినిమా థియేటర్లలో కలకలం రేగింది. ఆ మూడు థియేటర్లలోనూ హిందీ సినిమా(Hindi Movies)లే ప్రదర్శితమవుతాయి. మాస్క్‌లు ధరించిన వ్యక్తులు థియేటర్లలోపలికి వచ్చి గుర్తు తెలియని కెమికల్‌ను స్ప్రే చేయడంతో ప్రేక్షకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. యార్క్‌లోని వౌఘన్‌ సినిమా కాంప్లెక్స్‌లో మంగళవారం రాత్రి 9.20 గంటల సమయంలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఆ సమయంలో థియేటర్‌లో 200 మంది ఉన్నారు. స్ప్రే కారణంగా ప్రేక్షకుల్లో కొందరు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. విపరీతంగా దగ్గారు. పోలీసులు వచ్చేసరికి ఆ గుర్తు తెలియని వ్యక్తులు పారిపోయారు. కొందరు బాధితులకు పోలీసులు చికిత్స చేయించారు. ఈ వారంలో ఇలాంటి ఘటనలు మూడు నాలుగు జరిగాయని అక్కడి మీడియా వెల్లడించింది. స్కార్‌బరో టౌన్‌ సెంటర్‌లోని థియేటర్‌లో మంగళవారం రాత్రి దుర్వాసన వెదజల్లే బాంబును అమర్చినట్టు గుర్తు తెలియని వ్యక్తి తమకు ఫోన్‌ చేశాడని పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదన్నారు.

Updated On 9 Dec 2023 1:27 AM GMT
Ehatv

Ehatv

Next Story