కన్న తండ్రే తన కొడుకుపై కక్ష పెంచుకున్నాడు. తన మాట వినడంలేదని ఆవేశానికి లోనయ్యాడు. తన భార్య, తన కొడుకు కలిసి తనను అవమానించారని పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కొడుకును చంపేందుకు కుట్రకు తెరలేపాడు. ఇందకుకుగాను లక్షన్నర సుపారీ కుదుర్చుకుని 75 వేల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా ఒక రోజు ముందు తన ఇంటికి పిలిపించుకుని దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కన్న తండ్రే తన కొడుకుపై కక్ష పెంచుకున్నాడు. తన మాట వినడంలేదని ఆవేశానికి లోనయ్యాడు. తన భార్య, తన కొడుకు కలిసి తనను అవమానించారని పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కొడుకును చంపేందుకు కుట్రకు తెరలేపాడు. ఇందకుకుగాను లక్షన్నర సుపారీ కుదుర్చుకుని 75 వేల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా ఒక రోజు ముందు తన ఇంటికి పిలిపించుకుని దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

దక్షిణ ఢిల్లీ(South delhi) దేవ్లి(Devli) ఎక్స్‌టెన్షన్‌లోని రాజు పార్క్(Raju Park) సమీపంలో సింఘాల్‌ కుటుంబం ఉండేది. తండ్రీకొడుకుల మధ్య పలు విషయాలపై తరచూ గొడవలు జరిగేవి. తన భార్య కూడా గౌరవ్‌ వైపే నిలబడింది. తల్లీకొడుకు, తండ్రి విడివిడిగా ఉంటున్నారు. ఓ సారి ఘర్షణలో తన కొడుకు గౌరవ్‌ తనను చెంపదెబ్బ కొట్టాడు. దీనికి తల్లి ప్రోత్సాహం కూడా ఉండడంతో సింఘాల్‌కు(Singhal) కోపం కట్టలు తెంచుకుంది. అందరి ముందు తన పరువు పోయిందని వాపోయాడు. దీంతో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఇందు కోసం ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను సంప్రదించాడు.కాంట్రాక్ట్ కిల్లర్లకు రూ. లక్షన్నర ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.75 వేలు కూడా ఇచ్చారు. కానీ గౌరవ్‌ను చంపేందుకు ఒక రోజును ఎంచుకున్నాడు. అతడి పెళ్లికి ఒక్క రోజు ముందు చంపి తన భార్య క్షోభ పడాలని అనుకున్నాడట. దీంతో పెళ్లికి ఒకరోజు ముందు కొడుకు గౌరవ్‌కు చెందిన జిమ్‌లో పనిచేసే యువకుడితో గౌరవ్‌ను తన మరో ఇంటికి సింఘాల్‌ పిలిపించుకున్నాడు. గౌరవ్ రాగానే ఇనుప రాడ్లు, కత్తులు, కత్తెరతో దాడి చేశారు. అతని శరీరంపై 15కు పైగా గాయాలయ్యాయి. దీంతో అక్కడిక్కడే గౌరవ్‌(Gaurav) మృతి చెందాడు.

మరోవైపు పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా గౌరవ్ కనిపించకుండా పోవడంతో బంధువలంతా ఆందోళన చెందారు. గౌరవ్ కోసం వెతకగా తన తండ్రి ఉంటున్న నివాసం దగ్గర రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జైపూర్‌ పారిపోయిన తండ్రి సింఘాల్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజస్తాన్‌ పోలీసుల(Rajasthan Police) సాయంతో సింఘాల్‌ను జైపూర్‌లో అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ. 15 లక్షల విలువైన 886 గ్రాముల బంగారం దొరికిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) అంకిత్ చౌహాన్(Ankith chauhan) తెలిపారు. ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం ఇష్టంలేక పెళ్లికి ముందే కొడుకు గౌరవ్‌ను చంపేశానని పోలీసులకు సింఘాల్ చెప్పాడు. గౌరవ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే విషయంలో తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated On 9 March 2024 1:18 AM GMT
Ehatv

Ehatv

Next Story